Manchu Family son of india movie digital streaming in prime video
Manchu Family : మంచు మోహన్ బాబు మరియు మంచు విష్ణు ల పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ తారా స్థాయికి చేరాయి. ఇటీవల విడుదలైన సన్ ఆఫ్ ఇండియా సినిమా ప్రచారం తో మీమ్స్ మరియు విమర్శలు మరింత ఎక్కువ అయ్యాయి. అదిగో ఇదిగో అంటూ మంచు ఫ్యామిలీ పరువు తీసే విధంగా అత్యంత దారుణంగా కొందరు వ్యవహరిస్తున్నారు. కొందరు ఆరోగ్యకరమైన విమర్శలు చేస్తుంటే మరి కొందరు మాత్రం దారుణంగా విమర్శలు చేస్తూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. ఒక సినిమా బాలేదంటే చూడకుండా వదిలేయాలి.. లేదంటే విమర్శించాలి.. అదీ కాదంటే నెగిటివ్ ప్రచారం చేసేవారు కూడా ఉంటారు అంతేగాని మరీ దారుణంగా వ్యక్తిగత దూషణలకు దిగడం మాత్రమే కాకుండా కుటుంబం మొత్తం ను విమర్శించడం వంటి కార్యక్రమాలు చేయడం ఏమాత్రం సబబు కాదు.
మంచు ఫ్యామిలీ పై చేసిన విమర్శలు తార స్థాయికి చేరడంతో ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో మంచు ఫ్యామిలీ విమర్శలు చేస్తున్న వారికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ప్రతి ఒక్కరు విమర్శలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంటూ హెచ్చరించింది. పరువు నష్టం దావా వేస్తానంటూ నోటీసులు కూడా జారీ చేయడంతో ఒక్కసారిగా అంతా సైలెంట్ అయిపోయారు. సోషల్ మీడియా మరియు వెబ్ మీడియా లో ఇంతకు ముందు పోస్ట్ లు మరియు విమర్శలు అన్నీ కూడా డిలీట్ అయ్యాయి. మంచు ఫ్యామిలీ అనుకున్నది చేసే రకమే అనే ఉద్దేశంతో వెంటనే సోషల్ మీడియాలో సన్ ఆఫ్ ఇండియా ట్రోల్స్ కి పులి స్టాప్ పడింది.
trolls on manchu family stopped due to legal notice
మరో వైపు మంచు ఫ్యామిలీ ని సమర్ధించేవారు కూడా ఆ విమర్శలు చేసే వారిపై ఎదురు దాడికి దిగారు. ఇలా రెండు ఒకేసారి జరగడంతో మంచు ఫ్యామిలీ పై జరుగుతున్న సోషల్ దాడి కి బ్రేక్ పడ్డట్లయింది. ముందు ముందు ఇలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంచు ఫ్యామిలీ పై ఉంది. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఒకరిని ఒకరు గౌరవిస్తూ ప్రతి ఒక్కరితో గౌరవింపబడే అది గొప్ప విషయం. మంచు ఫ్యామిలీ కూడా ఈ విషయాన్ని ఫాలో అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. మంచు ఫ్యామిలీ విషయంలో ఇకపై సోషల్ మీడియాలో ఆ స్థాయి విమర్శలు ఉండక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి ముందు ముందు ఎలా జరుగుతుందో చూడాలి.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.