true love of manchu manoj on bhooma mounika
Manchu Manoj : గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ లో ఒకటే చర్చ. మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. గత శుక్రవారమే ఇద్దరూ ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకున్నారు. వీళ్ల పెళ్లి మంచు లక్ష్మి ఇంట్లో జరిగింది. చాలా తక్కువ మంది సన్నిహితుల మధ్య వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీళ్ల పెళ్లి తర్వాత దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దానికి కారణం.. ఇప్పటికే మనోజ్ కు, మౌనికకు పెళ్లి కావడం.
true love of manchu manoj on bhooma mounika
ప్రణతి రెడ్డి అనే యువతితో మనోజ్ కు పెళ్లి అయినా పెళ్లి తర్వాత నాలుగేళ్లకు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక.. భూమా మౌనిక కూడా గణేశ్ రెడ్డి అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది. వాళ్లకు ఒక బాబు పుట్టాడు. కానీ.. వాళ్లు కూడా కొన్ని కారణాలతో విడిపోయారు. మనోజ్.. విడాకులు తీసుకున్నాక.. చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. నిజానికి మనోజ్, మౌనికకు ముందే పరిచయం ఉంది. దాదాపు 12 ఏళ్లుగా ఇద్దరి మధ్య స్నేహం ఉంది. కానీ.. గత నాలుగేళ్ల నుంచి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
మనోజ్ విడాకులు తీసుకున్నాక డిప్రెషన్ లోకి వెళ్లడంతో ఆయనకు మోరల్ సపోర్ట్ ఇచ్చి మౌనిక ఆయనకు అండగా నిలిచింది. జీవితంలో ఏ విషయంలో ఓడినా ప్రేమలో మాత్రం గెలవాలి. ఇదే నేను నమ్మే సూత్రం. మేమిద్దరం మరింత దగ్గరయ్యాం.. నాకు మౌనిక చాలా మద్దతు ఇచ్చింది.. అంటూ పెళ్లి తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తన భార్యతో పాటు వచ్చిన మనోజ్ అన్నారు. తన భార్యకు ముందే ఒక కొడుకు ఉన్నా.. ఆ పిల్లాడిని కూడా దత్తత తీసుకొని తన సొంత కొడుకులా మనోజ్ చూసుకోవడంపై సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. మనోజ్ ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
Guntur Sp : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో.. సింగయ్య అనే వ్యక్తి…
Today Gold Price : బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఈరోజు జూన్ 23న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…
Black Alkaline : ఇక బ్లాక్ వాటర్ గురించి చెప్పాలంటే అంతా కాదు. దీని ప్రయోజనాలు అమోఘం. ఇటీవల కాలంలో…
This website uses cookies.