
Tulasi and pravallika do shopping together in intinti gruhalakshmi
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి సోమవారం 2 మే 2022, ఎపిసోడ్ 621 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నన్ను చదువు మానేసి ఇంట్లో పనులు చేయమంటున్నావా? నువ్వు మారిపోయావు మామ్.. రోజుకు ఒకలా బిహేవ్ చేస్తున్నావు. నాకు టిఫిన్ ఏం అక్కర్లేదు. నీ పనులు నువ్వు చూసుకో అని కోపంగా దివ్య.. తులసిని అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. పొద్దున్నే ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా. ఇంట్లో పనులు వదిలేసి.. వాకింగ్ కు ఎందుకు వెళ్లావు. వాకింగ్ ఏదో.. తర్వాత చేసుకోవచ్చు కదా అని అంటుంది అనసూయ. దీంతో పరందామయ్య వచ్చి.. వాకింగ్ కు తను వెళ్లే హక్కు కూడా లేదా అంటాడు. నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకమ్మా.. నీకు నచ్చింది చేయ్ అంటాడు పరందామయ్య.
Tulasi and pravallika do shopping together in intinti gruhalakshmi
అత్తయ్య మా ఫ్రెండ్ ప్రవళిక షాపింగ్ కు వెళ్లడానికి తోడు రమ్మన్నది. మీ అందరికీ కావాల్సినవి వండి పెట్టాకనే వెళ్తాను అంటుంది తులసి. దీంతో మా గురించి ఎందుకు లేమ్మా.. నీ కూతురు వెళ్లి అలిగింది కదా. ముందు వెళ్లి తన సంగతి చూడు అంటుంది అనసూయ. దీంతో దివ్య దగ్గరికి వెళ్లి తులసి తనను బతిమిలాడుతుంది. అర్థం అయ్యేలా అన్నీ వివరిస్తుంది. దీంతో నువ్వు రోజూ వాకింగ్ కు వెళ్లు మామ్.. నేను చూసుకుంటాను అన్ని పనులు అని చెబుతుంది దివ్య.
ప్రవళిక దగ్గరికి వెళ్లేందుక అన్ని వంటలు వండుతూ ఉంటుంది తులసి. ఇంతలో ప్రవళిక వస్తుంది. ఏం చేస్తున్నావు తులసి అంటుంది. అత్తామామ కోసం వంట వండుతున్నాను అంటుంది. పరందామయ్య, అనసూయ ఇద్దరూ తనకు ఇచ్చే మర్యాద, మద్దతును చూసి ప్రవళిక ముచ్చటపడుతుంది.
తర్వాత ఇద్దరూ కలిసి షాపింగ్ కు వెళ్తారు. చుడీదార్స్ షాపింగ్ చేద్దాం పదా అంటుంది. చుడీదార్స్ ఎవరికి అంటుంది. మన కోసమే అంటుంది. ఒక చుడిదార్ చూసి.. దాన్నీ వేసుకొని రా అంటుంది ప్రవళిక. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. తను చుడీదార్స్ చూస్తుంటే.. తులసి నిద్రపోతూ ఉంటుంది.
నేను ఇక్కడ చుడీదార్స్ చూస్తుంటే.. నువ్వేంటి నిద్రపోతున్నావు. నీకు నచ్చితేనే నేను తీసుకుంటాను అంటుంది ప్రవళిక. ఇంతలో ఒక చుడీదార్ తులసికి నచ్చుతుంది. నాకు ఇది నచ్చింది అంటుంది. పదా ఒకసారి ట్రయల్ చేసి చూద్దాం అంటుంది. నేను ఎందుకు అంటుంది.
నువ్వు కూడా ఒక డ్రెస్ ట్రయల్ చేసి చూడు. టైమ్ సేవ్ అవుతుంది అంటుంది. వెళ్లు వేసుకొనిరా అంటుంది. దీంతో సరే అని ట్రయల్ రూమ్ లోకి వెళ్తుంది తులసి. కానీ.. ప్రవళిక మాత్రం వేసుకోదు. తులసికి ఆ డ్రెస్ కరెక్ట్ గా సరిపోతుంది. బయటికి రా అంటుంది.
ఈ డ్రెస్ బాగుంది అంటుంది. నాకెందుకు ఈ డ్రెస్ అంటుంది. నువ్వు నీ గురించి ఆలోచించు. ఈ చుడీదార్ తో పాటు నీకు జాగింగ్ డ్రెస్ కూడా తీసుకున్నాను అంటుంది ప్రవళిక. కట్ చేస్తే.. ప్రేమ్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి కాస్త అడ్వాన్స్ డబ్బు కావాలంటాడు.
చేరి నెల కాలేదు. నేను జీతం ఎంతో కూడా డిసైడ్ చేయలేదు. అప్పుడే నీకు అడ్వాన్స్ కావాలా అంటాడు. అసలు నువ్వు ఎవరో తెలియదు. జాబ్ ఎన్ని రోజులు చేస్తావో తెలియదు. నీకు ఎందుకు ఇవ్వాలి డబ్బు అంటాడు. ఇప్పుడు ఇవ్వడం కుదరదు కానీ.. ఒక వారం తర్వాత రా చూద్దాం అంటాడు.
దీంతో అవసరం ఉన్నప్పుడు లేని డబ్బు.. అవసరం తీరాక ఎందుకు సార్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోబోతాడు. దీంతో బంగారు బాతును ఎందుకు వదులుకోవడం అని అనుకొని కొంత డబ్బు ఇచ్చి తన భార్యకు ఆసుపత్రి ఖర్చులకు ఇవి చూసుకో అని చెప్పి పంపిస్తాడు.
మరోవైపు పానీపూరీ తినే పందెం కడతారు ప్రవళిక, తులసి. ఇద్దరూ ఒకరి కంటే మరొకరు పోటీ పడి మరీ పానీపూరీలను తింటూ ఉంటారు. చాలా సంతోషంగా పానీపూరీ తింటూ ఉన్న తులసిని నందు చూస్తాడు. కోపంగా తన వైపునకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.