
Bigg Boss 6 Telugu Contestants List Goes Viral
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ ఆరో సీజన్ సందడి మొదలైంది. మొన్న లోగోను వదిలాడు. లోగో వెనుకున్న మర్మాన్ని కూడా చెప్పాడు. అన్ని రకాల ఎమోషనల్‌కు చిహ్నంగా అన్ని రకాల రంగులను పెట్టామని, ఇక ఈ షో ఈసారి అన్ని వయసుల వారిని అలరించేందుకు రాబోతోన్నట్టు చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు మొదటి ప్రోమోను వదిలారు. ఇందులో కాస్త ఎక్కువే అనిపించినా కూడా బిగ్ బాస్ షోకు ఉన్న ఫాలోయింగ్ క్రేజ్‌ను చాటేలా ఉంది. కూతురి పెళ్లి జరుగుతుంటే..అప్పగింతలు జరుగుతూ ఉంటే.. బిగ్ బాస్ అప్డేట్ వచ్చిందని మధ్యలోనే వదిలేసి వెళ్తాడు తండ్రి.
అలా ఆ షోకు ఎంత క్రేజ్ ఉందో చెప్పాలనే ఉద్దేశ్యంతోనే ప్రోమోను డిజైన్ చేశారు. అయితే ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్ట్ వైరల్ అవుతోంది. ఎవరికీ ఏదీ తెలియకపోయినా కూడా నెట్టింట్లో మాత్రం కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సారి సిరి ప్రియుడు శ్రీహాన్, గీతా మాధురి భర్త నందు మాత్రం కచ్చితంగా ఉంటారని అనుకుంటున్నారు. జబర్దస్త్ అప్పారావు, చంటి, గలాట గీతూ వంటి వారు కూడా రాబోతోన్నారట.
TV 9 Anchor Ismart Anjali Bigg Boss 6 Telugu Entry Confirm
ఉదయ భాను, సంజనా చౌదరి, ఆర్జే సూర్య, యూట్యూబర్ నిఖిల్, చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఇలా ఎంతో మంది పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. టీవీ 9 యాంకర్‌ని ప్రతీ సారి తీసుకుంటూ ఉంటారు. ఈ సారి టీవీ 9 నుంచి ఇస్మార్ట్ అంజలిగా ఫేమస్ అయిన ఆరోహిని తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఈమె తాజాగా తన ఇన్ స్టా గ్రాంలో బిగ్ న్యూస్ అని గాల్లో తేలిపోతోన్న పోస్ట్ వేసింది. బిగ్ న్యూస్ అంటే.. బిగ్ బాస్ షో అని అర్థమవుతోంది. అంటే ఈమె ఎంట్రీ అఫీషియల్‌గా కన్ఫామ్ అయినట్టు కనిపిస్తోంది.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.