Home » Entertainment » Umadevi Vs Anne Master In Bigg Boss 5 Telugu
Entertainment

Bigg Boss 5 Telugu : ఆనీ మాస్ట‌ర్‌ను ఉతికి ఆరేసిన ఉమాదేవి.. ఇద్ద‌రి మ‌ధ్య తిట్ల పురాణం..!

Authored By
mallesh
The Telugu News | Published on: September 16, 2021, 5:55 pm
Advertisement

bigboss-5..బిగ్ బాస్ తెలుగు సీజ‌న్-5 షో స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి ఎంతో ఎంట‌ర్ టైన్‌మెంట్‌గా సాగుతోంది. మొద‌టి రోజు నుంచే గొడ‌వ‌లు, గ్రూపులు, ఏడుపులు లాంటివి సాగుతున్నాయి. ఇప్ప‌టికే ఇంటి నుంచి స‌ర‌యు వెళ్లిపోగా మిగిల‌న వారు మాత్రం ఎవ‌రికి ఎవ‌రూ త‌గ్గ‌కుండా దుమ్ములేపుతున్నారు. త‌మ స‌హ‌జ‌త్వానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ నెటిజ‌న్ల ద‌గ్గ‌ర మార్కులు కొట్టేసేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక రీసెంట్‌గా జ‌రిగిన రింగ్ టాస్క్‌లో ఏకంగా త‌న్నుకునే వ‌ర‌కు వెళ్లారు. ప‌ర్పుల్ టీమ్ వ‌ర్సెస్ ఎల్లో టీమ్ అన్న‌ట్టు ఇరువురి మ‌ధ్య ఫైట్ సాగింది.

Advertisement

umadevi VS anne master in Bigg boss 5 telugu

లేడీస్ కూడా రెచ్చిపోయి మ‌రీ..

కాగా ఇందులో ప‌ర్పుల్ టీమ్ రింగ్‌లో ఉండ‌గా.. వారిని ఎల్లో టీమ్ బ‌య‌ట‌కు లాగే ప‌నిలో ప‌డ్డారు. అయితే ఇందులో లేడీస్ కూడా రెచ్చిపోయి మ‌రీ ఆడారు. ఇప్ప‌టికే ఆడ‌వారితో మ‌గ‌వారు అస‌భ్యంగా ఆడుతున్నార‌ని కొంద‌రు కంటెస్టెంట్లు కూడా కంప్ల‌యింట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయినా కూడా ఎక్క‌డా త‌గ్గ‌కుండా లేడీస్ కూడా మ‌గ‌వారితో స‌మానంగా ఆడారు. ఇందులో ఆనీ మాస్ట‌ర్ త‌న‌ను ఉమాదేవి కొట్టింద‌ని బాధ‌ప‌డింది. ఇన ఆవేశంతో కొన్ని అస‌భ్య‌క‌ర‌మైన మాట‌లు కూడా అన్న‌ది. చిల్ల‌రలాగా ఉన్నావ్ అంటూ ఆనీ మాస్ట‌ర్ కామెంట్ చేసింది.

Advertisement

umadevi VS anne master in Bigg boss 5 telugu

ఇక దీనికి ఉమాదేవి కూడా కౌంట‌ర్ వేస్తూ నేను చిల్ల‌ర్ అయితే నువ్వు పెద్ద క్లాసా అంటూ క‌డిగేసింది. ఇక ఒక‌రినొక‌రు ఎత్తిప‌డేసుకోవ‌డం కూడా మ‌న‌కు క‌నిపిస్తోంది. ఇక త‌మ‌ను ఎలా కొడుతారంటూ ప‌ర్పుల్ టీమ్ వారు బాగానే ర‌చ్చ చేస్తున్నారు. ఇక వారికి ఎల్లో టీమ్ కూడా బాగానే కౌంట‌ర్ వేసింది. అయితే తాము త‌న్నించుకోవ‌డానికి రాలేదంటూ బిగ్‌బాస్‌కు కంప్ల‌యింట్లు చేసుకున్నారు ఇరువురు కూడా.

Advertisement

umadevi VS anne master in Bigg boss 5 telugu

 

 

Advertisement

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి