Uppena : ఉప్పెన సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. డెబ్యూ హీరోగా మెగా మేనల్లుడు టాలీవుడ్ కి పరిచయమైన ఈ సినిమాతో పాతికేళ్ళ నుంచి చెక్కు చెదరకుండా ఉన్న రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేశాడు టాలీవుడ్ లో డెబ్యూ హీరోగా చిరుతతో రాం చరణ్ క్రియేట్ చ్జేసిన రికార్డ్ ని అలాగే బాలీవుడ్ లో డెబ్యూ హీరోగా కహోనా ప్యార్ హై సినిమాతో హృతిక్ రోషన్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ని వైష్ణవ్ తేజ్ బద్దలు కొట్టి ఇప్పట్లో మరే డెబ్యూ హీరో సాధించని రికార్డ్ సెట్ చేశాడు. ఒకరకంగా కొత్తగా ఇండస్ట్రీకి పరిచయమయ్యే ఏ స్టార్ కిడ్ కి అయినా ఇది పెద్ద సవాల్ అని చెప్పాలి.
uppena-combo repeats except the director
సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ లో సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సానా ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఉప్పెన సినిమాని నిర్మించారు. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి యంగ్ బ్యూటీ కృతిశెట్టి పరిచయం అయింది. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఊహించని విధంగా 100 కోట్లు వసూళ్ళు చేసి ఇండస్ట్రీ ప్రముఖులను ఆశ్చర్యపరచింది. ఇంత పెద్ద సక్సస్ ఇచ్చిన దర్శకుడు బుచ్చి బాబుకి నిర్మాతలు ఇటీవల ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. ఇక హీరో, హీరోయిన్, మ్యూజి డైరెక్టర్ రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ లకి ప్రశంసలతో పాటు బహుమతులు దక్కాయి.
కాగా మరోసారి ఇదే కాంబినేషన్ రిపీటవబోతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. వైష్ణవ్ తేజ్ – కృతిశెట్టి జంటగా సుకుమార్ రైటింగ్స్ – మైత్రీ మూవీ మేకర్స్ మరో సినిమాకి సన్నాహాలు చేస్తున్నారు. ఉప్పెన టీమ్ మొత్తం పని చేస్తోంది. కానీ దర్శకుడు మాత్రం బుచ్చిబాబు కాకుండా మరో డెబ్యూ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఈ దర్శకుడు కూడా సుకుమార్ శిష్యుడు కావడం విశేషం. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందట.
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
This website uses cookies.