uppena heroine Krithi Shetty new remuneration for upcoming movies
Krithi Shetty : ఉప్పెన సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. మొదటి సినిమా లోనే ఈ అమ్మడి అందం కు మరియు నటనకు జనాలు ఫిదా అయ్యారు. ఆ సినిమా లో నటిస్తున్న సమయంలో కేవలం పదహారు నుండి పదిహేడు సంవత్సరాలు మాత్రమే కృతి కి ఉన్నాయి. ఆ సమయంలో దాదాపుగా 15 లక్షల పారితోషికం మరియు ఆ పై పది లక్షల వరకు అదనపు పారితోషికంను కృతి శెట్టి అందుకుంది. ఉప్పెన సినిమా విడుదలకు ముందే ఈ అమ్మడికి మంచి గుర్తింపు రావడంతో ఆ సినిమా విడుదలకు ముందే దాదాపుగా 40 లక్షల పారితోషికం కు ఒక సినిమాకు కమిట్ అయ్యింది.
ఉప్పెన సినిమా విడుదల అయిన తర్వాత అమ్మడి జోరు పెరిగింది. ఏకంగా కోటి రూపాయల వరకు ఈ అమ్మడు డిమాండ్ చేయడం మొదలు పెట్టింది. అదే సమయంలో బంగార్రాజు మరియు శ్యామ్ సింగ రాయ్ సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. దాంతో కోటి అంటే పర్వాలేదు అన్నట్లుగా ఈ అమ్మడిని బుక్ చేయడం మొదలు పెట్టారు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడి పారితోషికం కాస్త తగ్గినట్లుగా తెలుస్తోంది. ఒకానొక సమయంలో కోటికి మించి కూడా పారితోషికం తీసుకుంది. కానీ తాజాగా ఈమె మళ్లీ కోటి లోపు పారితోషికం కు పడిపోయిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ మధ్య రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లను ఈ అమ్మడు మూట కట్టుకుంది.
uppena heroine Krithi Shetty new remuneration for upcoming movies
ముందు ముందు రాబోతున్న సినిమాలు అయినా ఈమెకు సక్సెస్ ను తెచ్చి పెడతాయా అంటే డౌటే అన్నట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు. అందుకే కొత్తగా ఈమె కమిట్ అవుతున్న సినిమాలకు మరీ తక్కువ పారితోషికంను నిర్మాతలు కోట్ చేస్తున్నారట. తప్పని పరిస్థితుల్లో ఆమె 75 నుండి 85 లక్షల వరకు పారితోషికం కు ఓకే చెబుతూ సైన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేయడం లేదు. రెండు మూడు సినిమాలు సక్సెస్ అయితే మళ్లీ కోటి ఆపై పారితోషికంతో సైన్ చేయాలని భావిస్తుందట. కొన్ని కథలు నచ్చడంతో తక్కువ పారితోషికం అయినా ఓకే చెబుతుందట.
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…
This website uses cookies.