Vadinamma 1 Nov Today Episode : వీడే మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ.. అని రిషి గురించి రఘురామ్ కు చెప్పిన సీత.. స్పృహలోకి వచ్చిన రఘురామ్ ఆ నిజాన్ని నమ్ముతాడా?

Advertisement
Published by
Advertisement

Vadinamma 1 Nov Today Episode : వదినమ్మ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 నవంబర్, 2021 సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి విషయం బావకు చెప్పేద్దామని అనుకుంటున్నాను అత్తయ్య అని రాజేశ్వరికి సీత చెబుతుంది. దీంతో మంచిది అమ్మా.. చాలా సంతోషం. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే పెద్దోడి దగ్గరికి వెళ్లు అంటుంది సీత. అయితే.. నాకు నువ్వు ఒక మాట ఇవ్వాలి అత్తయ్య. రిషి మా బిడ్డ అని మీరు మాత్రం ఎవ్వరికీ చెప్పండి. ఆ విషయం తెలిశాక.. బావ ఏం చెప్తే అది చేద్దాం. నువ్వు మాత్రం ఎవ్వరికీ చెప్పకు అత్తయ్య అంటుంది రాజేశ్వరి. సరే.. అత్తయ్య రిషిని తీసుకొని నేను బయలు దేరుతాను అంటుంది సీత.

Advertisement

కట్ చేస్తే.. ఆసుపత్రిలో ఇంకా స్పృహ కోల్పోయే ఉంటాడు రఘురామ్. మరోవైపు ఇంట్లో రిషి కనిపించకపోయేసరికి శైలూ భయపడుతుంది. రిషి ఎక్కడికి వెళ్లాడు అని టెన్షన్ పడుతుంది. రిషి.. రిషి అంటూ అరుస్తూ కిందికి వస్తుంది. లక్కీ మన బాబు ఎక్కడ అంటుంది. గదిలోనే ఉండాలి కదా అంటాడు లక్ష్మణ్. పొద్దున్నే మన బాబును ఎవరు తీసుకెళ్లారు అంటుంది. అత్తయ్య బాబును ఎవరు తీసుకెళ్లారు అని అడిగితే సీత తీసుకెళ్లింది అంటుంది. దీంతో లక్కీ మనం ఆసుపత్రికి వెళ్దాం పదా అంటుంది శైలూ.కంగారు ఎందుకు అమ్మ.. సీత వచ్చేస్తుంది అంటుంది. రాకపోతే అంటుంది. అసలే రోజులు బాగలేవు.. రిషిని ఆసుపత్రికి తీసుకెళ్లడం ఏంటి అని శైలూ ప్రశ్నిస్తుంది. వెంటనే హాస్పిటల్ కు వెళ్దాం పదా అంటుంది శైలూ. వెంటనే లక్కీని తీసుకెళ్తుంది. ఇంతలో సీత.. ఆసుపత్రికి రిషిని తీసుకొని వెళ్తుంది. బావా.. కళ్లు తెరిచి చూడు.. ఇదిగో నీ బిడ్డను నీ చేతుల్లో పెట్టడానకి తీసుకొచ్చాను బావా. ఒక్కసారి లేబావా. ఎందుకు అలా మొండి చేస్తున్నావు. నిజాన్ని నాలోనే దాచుకుంటే నన్ను ఒక దోషిలా చూస్తున్నారు. గుండెలేని బండరాయి అనుకుంటున్నారు. మనసు మార్చుకొని వచ్చాను. నువ్వు చేతగాని వాడివి.. దురదృష్టవంతుడివి కాదు. ఒక బిడ్డకు తండ్రివి అది చెప్పడానికే వచ్చాను. నీ బిడ్డను నీకు చూపించడానికని వస్తే ఉలుకు పలుకు లేకుండా అలా కళ్లు మూసుకొని పడుకుంటే ఎలా బావ అంటుంది. ఇంతలో ఇవన్నీ సీత.. అన్న వింటాడు.

Advertisement

Vadinamma 1 Nov Today Episode : రఘురామ్ కు స్పృహ

బాబు చేతిని.. రఘురామ్ చేతిలో పెట్టగానే రఘురామ్ కు స్పృహ వస్తుంది. వెంటనే చూడు బావా.. వీడే మన రక్తం పంచుకు పుట్టిన బాబు అంటుంది. వీడే బావా… నన్ను అమ్మా అని పిలిచిన బిడ్డ వీడే అంటుంది. వీడు రిషి కదా అంటాడు రఘురామ్. వీడే మన బిడ్డ అంటుంది సీత. మనకు పుట్టిన బిడ్డ బావ అంటుంది. ఒట్టు బావ.. నేను నిజం చెబుతున్నాను అంటుంది. ఎందుకు సీత నన్ను మభ్యపెడుతున్నావు అంటాడు రఘురామ్. దీంతో అసలు జరిగిన విషయం చెబుతుంది సీత. దీంతో షాక్ అవుతాడు రఘురామ్.అప్పుడు తన కొడుకును తీసుకొని ముద్దాడుతాడు. ఇంతలో శైలూ, లక్ష్మణ్.. ఇద్దరూ హాస్పిటల్ కు వస్తారు. రఘురామ్ పిల్లాడిని ఎత్తుకొని ఉండటం చూసి శైలూ షాక్ అవుతుంది. బావగారు మీరు లేచారా? మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది అంటుంది. రిషి ఇంట్లో లేకపోయేసరికి టెన్షన్ పడి ఆసుపత్రికి వచ్చాం అంటుంది శైలూ. వెంటనే రిషిని తీసుకొని వెళ్లిపోతారు ఇద్దరు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Varanasi Movie : గ్లోబల్ బాక్సాఫీస్‌పై ‘వారణాసి’ దండయాత్ర..!

Varanasi Movie : భారతీయ సినిమా ప్రస్తుతం కేవలం దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటుతోంది.…

45 minutes ago

CM Chandrababu : ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. వాట్సప్ గవర్నెన్స్‌తో విప్లవాత్మక మార్పులు..!

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లే దిశగా మరో భారీ అడుగు వేసింది. ఇకపై…

2 hours ago

Jasprit Bumrah : MI vs SRH: వాంఖడే కోటలో విలన్‌గా మారిన ‘యార్కర్ కింగ్’!

Jasprit Bumrah : ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ (MI) అంటేనే ఒక బ్రాండ్. ముఖ్యంగా వాంఖడే స్టేడియంలో 200…

5 hours ago

వడదెబ్బ Sunstroke లక్షణాలు ఇవే.. ఈ సంకేతాలు కనిపిస్తే ప్రాణాపాయం

Sunstroke  : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతుండటంతో 'వడదెబ్బ'…

5 hours ago

Watermelon : పుచ్చకాయ తింటే ప్రాణం పోతుందా? ముంబై ఘటన వెనుక అసలు నిజాలివే !

వేసవి తాపం తీర్చుకోవడానికి పుచ్చకాయ (Watermelon) అమృతంలా పనిచేస్తుంది. కానీ, ఇటీవల ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు…

19 hours ago

Myrobalan : నైట్ 1 స్పూన్ ఈ పొడి తింటే చాలు.. మలబద్ధకం, గ్యాస్ మటాష్..!

Myrobalan  : చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య మలబద్ధకం. ఉదయాన్నే విరేచనం సాఫీగా కాకపోవడం వల్ల రోజంతా అసౌకర్యంగా, కడుపు…

21 hours ago

Software Engineer : ఎంతపని చేశావ్ మానస! ముఖం చూడకుండానే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ. 81 లక్షల టోకరా..

Software Engineer : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. హాయిగా సాగిపోతున్న అశోక్ జీవితంలోకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా 'పూజిత…

22 hours ago

Pregnant Summer : ఎండాకాలం గర్భిణీ స్త్రీలు ఏమి తినకూడదో మీకు తెలుసా..?

Pregnant Summer  : గత కొన్ని రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి, ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యక్ష…

1 day ago

IPL 2026 : ఆరెంజ్ క్యాప్ కోసం కుర్రాళ్ల యుద్ధం! 15 ఏళ్ల వైభవ్ సంచలనం.. టార్గెట్ చేసిన అభిషేక్, ఇషాన్!

ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం.. ఫోర్లు, సిక్సర్ల జాతర! ఈ మెగా లీగ్‌లో బ్యాటర్లు అందరూ ప్రాణం ఇచ్చేది ఆ…

1 day ago

Puranapanda Srinivas : ఒకే రోజు మూడు మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్..!

ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…

1 day ago

Heat Stroke : వడదెబ్బ ప్రాణాంతకం కావచ్చు దాని లక్షణాలు, ఈ నివారణ చర్యలను పాటించండి

Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండ‌లు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కార‌ణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…

3 days ago

Ganji Benefits : ప్రతి రోజూ గంజి తాగితే .. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు .. !

Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…

4 days ago