Vadinamma 10 Nov Today Episode : రిషి తనకు దక్కకుండా పోతాడేమోనని పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్న శైలూ.. రఘురామ్ ను అనరానిమాటలు అన్న జనార్ధన్

Vadinamma 10 Nov Today Episode : వదినమ్మ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 నవంబర్ 2021, బుధవారం ఎపిసోడ్ 696 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషికి బ్లడ్ ఇచ్చాక.. సీతపై సీరియస్ అవుతాడు రఘురామ్. నీవల్లే ఇదంతా.. అందరినీ మోసం చేశావు అని చెబుతాడు. ఇంతలో శైలూ అమ్మా నాన్న వస్తారు. సీత ఏమైందమ్మా.. బాబుకు ఎలా ఉంది. వాడు మెట్ల మించి పడిపోవడం ఏంటి.. అని అడుగుతుంది శైలూ తల్లి. ఆవిడను అడిగితే ఏం చెబుతుంది. తప్పు అంతా నీ కూతురు మీద రుద్దుతుంది. అలవాటే కదా.. ఎన్నిసార్లు చూడలేదు వీళ్లను అంటాడు జనార్ధన్. భరత్ ఏదో అనబోతాడు. భరత్.. ఊరుకో. జనార్ధన్ గారు ఏం జరిగింది అనేది తర్వాత మాట్లాడుకుందాం. ముందు బాబు ప్రమాదం నుంచి బయటపడ్డాడు అంటాడు రఘురామ్.

vadinamma 10 november 2021 full episode

నాకు నిజం ఇప్పుడే తెలియాలి.. అంటే బాబు మెట్ల నుంచి కింద పడ్డాడు అంటుంది సీత. దీంతో పడ్డాడా.. లేక పడేశారా.. అంటాడు జనార్ధన్. బాబును చూసుకోలేకపోయారా.. ఇంత మంది ఉన్నారు.. అంటూ జనార్ధన్ సీరియస్ అవుతాడు. ఇది చిన్నదెబ్బ కాబట్టి సరిపోయింది. అదే పెద్ద దెబ్బ అయితే.. అంటూ భయపెడతాడు జనార్ధన్. సీత సీత అంటూ తెగ భజన చేస్తుంటావు కదా.. ఆవిడ గారి డైరెక్షన్ లోనే వాళ్లాయన తెగ రెచ్చిపోతున్నాడు. నీ కూతురు బిడ్డను కిడ్నాప్ చేసి ఆడుకుంటున్నాడు అంటాడు జనార్థన్.

ఇంతలో డాక్టర్ వస్తాడు. డాక్టర్ మీరేనా నా మనవడికి ట్రీట్ మెంట్ చేసేది అని అడుగుతాడు. నేను లోకల్ ఎమ్మెల్యేను. మా మనవడి పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతాడు. మీ మనవడికి ఎలాంటి ప్రమాదం లేదు అంటాడు డాక్టర్. దీంతో అందరూ సంతోషిస్తారు. రిషిని తీసుకొని నర్స్ వస్తుంది. రిషిని శైలూ ఎత్తుకుంటుంది. శైలూ ఒకసారి బాబును ఇస్తావా? వెంటనే ఇస్తాను అంటాడు రఘురామ్. వెంటనే రిషిని తీసుకున్న జనార్థన్.. రిషిని ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీడు నా మనవడు.. ఎవ్వరికీ నా మనవడిని ఇవ్వాల్సిన అవసరం లేదు.. అంటాడు జనార్ధన్.

డాక్టర్ వచ్చి.. డబ్బులు కట్టి బాబును తీసుకెళ్లండి అని చెబుతాడు. దీంతో అల్లుడు గారు బిల్లును క్లియర్ చేసేయండి.. మన ఇంటికి వెళ్దాం అంటాడు జనార్ధన్. దీంతో సీత షాక్ అవుతుంది. వాళ్లింటికి వెళ్లడం ఏంటి లక్ష్మణ్ అంటుంది సీత. దీంతో ఇంకోసారి ఇలాంటిది జరగదని మాటిస్తున్నాను అంటుంది సీత. కానీ.. జనార్ధన్ అస్సలు వినడు. లక్ష్మణ్ కూడా మనింటికే వెళ్తున్నాం.. ఈ మాట మీ నాన్న గారికి చెప్పు అంటాడు.

Vadinamma 10 Nov Today Episode : పార్వతి, సిరిపై శైలూ సీరియస్

లక్ష్మణ్.. భరత్ బిల్ పే చేస్తాడు. నువ్వు, శైలూ.. బాబును తీసుకొని ఇంటికి రండి.. అని చెబుతుంది సీత. దిష్టిబొమ్మల్లా మనమెందుకు ఇక్కడ.. వెళ్దాం పదా అంటాడు జనార్ధన్. భరత్, రఘురామ్ బిల్లు కట్టడానికి వెళ్తారు. అందరూ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఈ ఇల్లు ఎందుకిలా తయారవుతుందో నాకైతే అర్థం కావడం లేదు అంటుంది రాజేశ్వరి. ఎవ్వరి ముఖంలోనూ సంతోషం లేదు. ఎవరి ముఖంలోనూ తృప్తి లేదు. ఎవరి వల్ల ఇదంతా అని రాజేశ్వరి బాధపడుతుంది. ఇంతలో పార్వతి వస్తుంది. రిషిని మీ పెద బావ కొట్టిండంట కదా.. అని అంటుంది. దీంతో సిరి సీరియస్ అవుతుంది. రఘురామ్ బావ ఏం చేయలేదు. శైలూ వల్లనే ఇదంతా జరిగింది అంటుంది సిరి. ఈ విషయం విని శైలూ.. సిరి సీరియస్ అవుతుంది. ఇంతలో లక్ష్మణ్ వస్తాడు. శైలూ ఏమైంది.. ఎందుకిలా అరుస్తున్నావు అంటాడు లక్ష్మణ్. ఈ ఇంట్లో నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు అంటుంది. నన్ను నా ఫీలింగ్స్ ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అంటుంది. చాలా టెన్షన్ పడుతుంది. పార్వతిపై కూడా శైలూ సీరియస్ అవుతుంది.

vadinamma 10 november 2021 full episode

మరోవైపు రిషిని చూసేందుకు లక్ష్మణ్ అంటూ పైకి వస్తాడు రఘురామ్. బాబు నిద్రపోతున్నాడని చెప్పు అని లక్ష్మణ్ తో అంటుంది శైలూ. మరోవైపు రిషి.. లాగులోనే టాయిలెట్ పోసుకోవడంతో.. రిషిని తిడుతుంది శైలూ. శైలూ రిషిని తిట్టడం తట్టుకోలేకపోతాడు రఘురామ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Share

Recent Posts

Samantha : పెళ్ల‌య్యాక బుద్దొచ్చింది.. నాగ చైత‌న్య చేసిందేమి లేద‌న్న స‌మంత‌..!

Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైత‌న్య‌-స‌మంత‌లు ఊహించ‌ని విధంగా విడాకులు తీసుకున్నారు. వారు విడిపోయి చాలా ఏళ్లు…

24 minutes ago

Types Of Kisses : శ‌రీరంపై మీరు పెట్టుకునే ముద్దుతో అవ‌త‌లి వ్య‌క్తిపై మీ ప్రేమ‌ను చెప్పొచ్చు తెలుసా?

Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…

1 hour ago

Dinner Before 7 pm : రాత్రి భోజ‌నం 7 గంట‌ల‌కు ముందే ముగిస్తే క‌లిగే ఆశ్చ‌ర్య‌క‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…

2 hours ago

Central Govt : ఉగ్ర‌వాద దాడుల్ని లైవ్‌లో చూపించొద్దు.. సీరియ‌స్ అయిన కేంద్రం..!

Central Govt : ప్ర‌స్తుతం భార‌త్ - పాక్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఆపరేషన్ సింధూర్ త‌ర్వాత పాకిస్తాన్…

3 hours ago

IPL 2025 Postponed : బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వాయిదా ప‌డ్డ ఐపీఎల్ 2025..!

IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ ర‌ద్దు అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్టు…

4 hours ago

Army Jawan Murali Naik : భార‌త్-పాక్ యుద్ధం.. వీర‌మ‌ర‌ణం పొందిన జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్

Army Jawan Murali Naik : భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…

5 hours ago

Brain Healthy : మీ మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా : పదునైన మరియు కేంద్రీకృత మనస్సు కోసం చిట్కాలు

Brain Healthy : మీ మెదడు మీ సాధారణ శ్రేయస్సు, జీవన నాణ్యతలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. శారీరక…

7 hours ago

Good News : గుడ్‌న్యూస్‌.. కేంద్రం కొత్త ప‌థ‌కంతో ఒక్కొక్కరికీ ఉచితంగా రూ.1.50 లక్షలు…!

Good News :  భారత ప్రభుత్వం 2025 మే 5న రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స…

8 hours ago