Vadinamma 12 Nov Today Episode : సీతను క్షమించమని కోరిన రఘురామ్.. మళ్లీ రఘురామ్, సీత ఇద్దరూ కలిసిపోయారు

Vadinamma 12 Nov Today Episode : వదినమ్మ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 నవంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 698 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు చేసేది కరెక్ట్ కాదు శైలూ అంటూ సిరి అంటుంది. దీంతో సిరిపైనే రివర్స్ అవుతుంది శైలూ. నీ బిడ్డ అయితే ఒక రూల్.. నా బిడ్డ అయితే ఇంకో రూలా? నీది తల్లి ప్రేమ. నాది తల్లి ప్రేమ కదా.. అడిగితే బాధపడతారని ఊరుకుంటే ఎందుకు రెచ్చగొడుతున్నావు అంటుంది శైలూ. దీంతో ఏం మాట్లాడాలో కూడా సిరికి అర్థం కాదు. ఏదో చెప్పబోతుంది కానీ.. ఊరుకుంటుంది సిరి.

vadinamma 12 november 2021 full episode

కట్ చేస్తే.. బాబుకు పాలు తాగించి.. మందులు తాగిస్తుంది శైలూ. ఎందుకురా నేను ఆరోజు ఎత్తుకుంటే గుక్కపెట్టి ఏడ్చావు. చాలా కోపం వచ్చింది. నీ మీద కాదు మీ పెదనాన్న గారి మీద. మీ పెదనాన్న నీమీద ఎక్కువ ఆపేక్ష చూపిస్తున్నారు. మా ఆవేశం నీకు రాకుండా చూసుకుంటున్నాం. తెలియకుండానే నాలో భయం మొదలైందిరా. ఆ భయంతోనే నేను ఇలా చేశాను అంటుంది శైలూ. నువ్వైనా ఈ అమ్మను అర్థం చేసుకోరా.. అంటూ తన బాబును బుజ్జగిస్తుండగానే లక్ష్మణ్ వస్తాడు.

శైలూ.. ఉన్నట్టుండి.. ఇంత సెన్సిటివ్ గా తయారు అవుతున్నావు ఏంటి.. అంటాడు లక్కీ. నేను ఏం చేసినా తప్పుగానే అనిపిస్తుంది. తల్లికుండే భయం వేరు. తండ్రికుండే దైర్యం వేరు అంటుంది శైలూ. బాబు ఆసుపత్రి నుంచి వచ్చినప్పటి నుంచి నువ్వు ఈ రూమ్ వదిలేసి రావడం లేదు ఎందుకు అంటాడు లక్ష్మణ్. బాబు నాకు దూరం అయితే నేను తట్టుకోలేను అంటే.. అలా ఏం జరగదు శైలూ అంటాడు లక్కీ.

ఎందుకు జరగదు. ఇంట్లో ఒకప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు లక్కీ అంటుంది. సరే.. పదా భోంచేద్దాం అంటాడు. నాకు ఆకలి లేదు అంటుంది శైలూ. ఆకలి లేకపోవడం ఏంటి అని అంటాడు. నన్ను వదిలేయ్ లక్కీ.. ప్లీజ్ నన్ను, నా బాబును వదిలేయ్ అంటుంది. దీంతో లక్కీనే అన్నం కలుపుకొని తీసుకొచ్చి తనకు తినిపిస్తాడు లక్కీ.

రిషి మీద ఉన్న ప్రేమను అస్సలు చంపుకోలేకపోతున్నాడు నా కొడుకు. ఏం చేయాలి. మరోవైపు శైలూ కూడా తన బిడ్డను వదిలి ఉండలేకపోతుంది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి.. నువ్వు నా నోటి ద్వారా చెప్పించినా.. ఆ నిర్ణయం మాత్రం నీదే స్వామీ అంటూ దేవుడిని వేడుకుంటుంది రాజేశ్వరి.

Vadinamma 12 Nov Today Episode : రఘురామ్ తో మనసు విప్పి మాట్లాడిన సీత

మరోవైపు రఘురామ్ ఇంటికి వస్తాడు. సీత.. తనతో మాట్లాడుతుంది. ఇన్నేళ్లు ఏ విషయంలోనూ నువ్వు నన్ను వేలెత్తి చూపించలేదు. ఏం చేసినా నీకు నచ్చుతుందనే అనుకున్నాను. కానీ.. ఈరోజు భయం వేస్తుంది బావా. బాబును త్యాగం చేసిన విషయంలో నిన్ను బాధపెట్టినట్టు ఇంకెన్ని విషయాల్లో నిన్ను బాధపెట్టానో అని బాధేస్తుంది. ఎప్పటికైనా నన్ను క్షమించాలని అనుకుంటే అది నా అదృష్టం లాగానే భావిస్తాను.. అని అంటుంది.

తప్పు చేసిన నేను పైన పడుకోవడం ఏంటి.. నేనే కింద పడుకుంటాను. నువ్వు పైన పడుకో బావా అంటుంది సీత. దీంతో తన చేయి పట్టుకొని క్షమించమని పెద్ద మనసుతో నువ్వు అడిగినా.. నిన్ను క్షమించే అర్హత నాకు లేదు సీత. ఎందుకంటే తల ఎత్తుకునే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. తల దించుకునే స్థితిలో నేను ఉన్నాను.. అంటాడు రఘురామ్. దీంతో వద్దు బావా అలా అనకు అంటూ తనను హత్తుకుంటుంది.

బావా ఎప్పుడైనా నా మీద కోపం వస్తే నా గొంతు పిసికేయ్.. కానీ మాట్లాడకుండా మాత్రం ఉండకు. ఈ ఒక్కసారి తట్టుకున్నాను కానీ.. ఇంకోసారి నావల్ల కాదు బావా అంటుంది. ఇంకెప్పుడూ ఇలా చేయను అని మాటిస్తున్నాను అంటాడు రఘురామ్. నువ్వే నన్ను క్షమించు అంటూ సీత కాళ్లమీద పడబోతాడు రఘురామ్.

ఉదయమే అనాథ ఆశ్రమం నుంచి ఇద్దరు వ్యక్తులు వస్తారు. ఎవరు వీళ్లు అని అడుగుతాడు రఘురామ్. వీళ్ల దగ్గర చాలామంది అనాథ పిల్లలు ఉంటారు. ఎంతోమంది పిల్లలు లేనివాళ్లు వీళ్ల దగ్గర నుంచి దత్తత తీసుకుంటారు. చాలామంచి ఆశ్రమం. మనకు ఎలాంటి బాబు కావాలో చెబితే మనం వెళ్లి చూసుకోవచ్చు అంటాడు లక్కీ. అన్నయ్య వదినలు పిల్లలు లేక బాధపడుతున్నారు కదా.. అందుకే వాళ్ల కోసం ఓ పిల్లాడిని దత్తత తీసుకుందామని చెబుతాడు లక్కీ. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

56 minutes ago

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

9 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

10 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

11 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

13 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

14 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

15 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

15 hours ago