Vadinamma 15 Nov Today Episode : భరత్ చెంప చెళ్లుమనిపించిన లక్ష్మణ్.. రఘురామ్ ను కూడా కొట్టబోయి..

Vadinamma 15 Nov Today Episode : వదినమ్మ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 నవంబర్ 2021, సోమవారం 700 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జనార్ధన్.. ధాన్యం కొనుగోలు చేస్తున్న రఘురామ్ దగ్గరికి వచ్చి.. నీకు బిడ్డలు లేరు కదా అని కొడుకా కొడుకా అంటూ నా మనవడి వెంట ఎందుకు పడుతున్నావు. అందుకే జాలిపడి అనాథను దత్తత తీసుకోవడానికి సెట్ చేస్తే వెనక్కి తిరిగి పంపించావట. ఇంతకీ నీ మనసులో ఏముంది. ఏమనుకుంటున్నావు చెప్పు అంటాడు జనార్థన్.

vadinamma 15 november 2021 full episode

అంటే.. ఇది నీ ఐడియానా అంటాడు రఘురామ్. అవును.. లేకపోతే లక్ష్మణ్ కు అంత సీన్ ఎక్కడిది అంటాడు. ఇంట్లో భరత్ బిడ్డ కూడా ఉంది. మరి.. భరత్ బిడ్డను దగ్గరకు తీసుకోకుండా కేవలం రిషిని మాత్రమే ఎందుకు దగ్గరికి తీస్తున్నావు. అసలు నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు అని రఘురామ్ ను జనార్థన్ ప్రశ్నిస్తాడు. పిల్లలు కావాలంటే రాత్రి కష్టపడు.. లేదంటే నీ భార్య సీత పర్మిషన్ తీసుకొని ఇంకో పెళ్లి చేసుకో.. అంటూ ఏదేదో వాగుతాడు జనార్థన్. ఆయన ఏమన్నా కూడా రఘురామ్ ఏమనడు.

నా గురించి తెలిసి కూడా నా తమ్ముడు అనాథను ఎలా దత్తత తీసుకొమ్మన్నాడా అని ఇన్ని రోజులు ఆలోచించాను కానీ.. ఇప్పుడు అర్థం అయింది. ఇది వాడి సలహా కాదు.. ఇది నీ సలహా అని అర్థం అయింది. ఇప్పుడు నేను రిలాక్స్ అవుతాను అంటాడు రఘురామ్.

భరత్ కోపం ఆపుకోలేడు. వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. లక్ష్మణ్ అన్నయ్య అంటూ ఆవేశంతో పిలుస్తాడు. ఇంతలోనే రఘురామ్ కూడా ఇంటికి వస్తాడు. ఒరేయ్ భరత్ ఏమైందిరా.. అని అంటుంది సీత. ఒరేయ్ వద్దురా అంటాడు రఘురామ్ కానీ.. వినడు.. దీంతో లక్ష్మణ్ కిందికి వస్తాడు.

Vadinamma 15 Nov Today Episode : వీడికి వీళ్ల మామ ఇప్పుడు దేవుడయ్యాడు అంటూ లక్ష్మణ్ పై పైర్ అయిన భరత్

ఎందుకురా అలా అరుస్తున్నావు అంటాడు లక్ష్మణ్. ఏంట్రా నువ్వు చేసిన పని. మన ఇంటి వ్యవహారాల్లో బయటి వ్యక్తి వేలు ఎందుకు పెట్టాలి. వీడు ఇన్నాళ్లు వీళ్లు మామ గారిని చీకొట్టి.. ఇప్పుడు ఆయనే దేవుడు అయ్యాడు. మార్గదర్శకుడు కూడా అయ్యాడు. అనాథను మీకు దత్తతగా ఇప్పించమని ఆయనగారే నీ బిడ్డ లక్ష్మణ్ కు సలహా ఇచ్చారట.. అని అసలు నిజం చెబుతాడు భరత్.

లక్ష్మణ్.. అయినా మాట వినడు. అవును విన్నాను అయితే ఏంటి అంటాడు. భరత్ అస్సలు ఆగడు. నీది సంస్కారమా అంటాడు. నా భార్యను కాపాడుకోవడం కోసం.. అన్నయ్య దృష్టిని రిషి నుంచి మళ్లించడం కోసం నేను ఈ పని చేశాను తప్పితే.. ఇందులో తప్పేముంది అంటాడు లక్ష్మణ్.

ఉదయమే బాబుతో ఆడుకోవడానికి భరత్.. రిషిని రఘురామ్ కు ఇస్తాడు. మళ్లీ బాబు కనిపించడం లేదని టెన్షన్ పడుతుంది శైలూ. చూస్తే బాబు రఘురామ్ దగ్గర ఉండటంతో బాబును మళ్లీ ఎందుకు తీసుకున్నావంటూ ప్రశ్నిస్తాడు లక్ష్మణ్. భరత్ ఇచ్చాడని చెబుతాడు రఘురామ్. దీంతో భరత్ చెంప చెళ్లుమనిపిస్తాడు లక్ష్మణ్. రఘురామ్ ను కొట్టలేక నాకన్నా పెద్ద అని వదిలేస్తున్నా అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

58 minutes ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

1 hour ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

4 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

5 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

6 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

8 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

9 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

18 hours ago