vadinamma 16 november 2021 full episode
Vadinamma 16 Nov Today Episode : వదినమ్మ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 నవంబర్ 2021, మంగళవారం 701 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లక్ష్మణ్ చేసిన నిర్వాకాన్ని భరత్.. సీతకు చెబుతాడు. దీంతో సీత కూడా బాధపడుతుంది. రఘురామ్ ను అందరూ తిడుతుండటం చూసి భరత్ తట్టుకోలేడు. అయినా.. పెద్దన్నయ్య నోరు తెరిచి ఒక్క మాట అయినా అన్నారా అంటే.. తన వైపు తప్పు ఉంది కాబట్టి ఆయన నోరు తెరవడం లేదు. అయినా మేం ఏం తప్పు చేశాం. మమ్మల్ని ఎందుకు తప్పు పడుతున్నారు.. అంటూ చెబుతుంది శైలూ.
vadinamma 16 november 2021 full episode
ఒప్పుకుంటానురా.. నువ్వు చెప్పింది నిజమే. మాకంటే.. రఘురామ్ అన్నయ్య, సీత వదిన మీద నీకే ప్రేమ ఉంది. అది నిరూపించుకో. నీ కూతురునే వాళ్లకు దత్తత ఇవ్వొచ్చు కదా. నీ బిడ్డనే దత్తత ఇవ్వు. నీ ప్రేమను నిరూపించుకో అంటాడు లక్ష్మణ్. దీంతో అందరూ షాక్ అవుతారు. సిరి కూడా షాక్ అవుతుంది. దీంతో మేము ఇప్పుడు ఎవరి బిడ్డను దత్తత తీసుకునే ఆలోచనలో లేము. అందరూ కాస్త సైలెంట్ గా ఉండండి.. అని చెబుతాడు రఘురామ్. ఈ గొడవ అంతటికీ కారణం.. నేను, నా ప్రవర్తన.. అమ్మ శైలూ.. ఏదో ఆరాటంలో తెలియకుండా నేనే నిన్ను బాధపెట్టాను.. భయపెట్టాను.. తప్పే క్షమించు.. అని రఘురామ్.. శైలూను వేడుకుంటాడు.
మొన్ననే మా పెళ్లి రోజును ఘనంగా చేశారు. ఇంకా ఆ తీపి గుర్తులు నా మదిలో ఉన్నాయి. నేను కోరుకున్నది ఒక్కటే.. ఆరోజు మీరు ఎలా సంతోషంగా ఉన్నారో.. ఎప్పుడూ మీరు అలాగే ఉండాలి. మీరంతా మా బిడ్డలు.. ఎందుకో.. ఆరోజు ఎమోషన్ లో నా బిడ్డను తలుచుకొని బాధపడ్డాను.. మిమ్మల్ని బాధపెట్టాను.. అని ఎమోషనల్ అవుతాడు రఘురామ్.
నా తమ్ముళ్లు మారిపోయారు సీత.. అని రఘురామ్ సీతతో చెబుతాడు. నీ ముందు మాట్లాడటానికే భయపడే నీ తమ్ముళ్లు.. ఇప్పుడు నీ ముందే పోట్లాడుకుంటున్నారు అంటుంది సీత. ఏది ఏమైనా.. రిషి గురించి మాత్రం అస్సలు లక్ష్మణ్, శైలూకు తెలియకూడదు.. అంటాడు రఘురామ్.
మరోవైపు సిరి, భరత్.. ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే మనమే ఒక నిర్ణయం తీసుకోవాలి అంటాడు భరత్. వైదేహిని అన్నయ్య, వదినమ్మలకు దత్తత ఇద్దాం అంటాడు భరత్. ఇంతకుముందు అడిగినప్పుడు ఒప్పుకున్నావు.. ఇప్పుడు కూడా ఒప్పుకుంటావని అనుకుంటున్నా. శైలూ వదినకు మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం లేదు.
కానీ.. మనకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది కదా. వదినమ్మ, అన్నయ్య రుణం ఇలాగైనా తీర్చుకుందాం. నువ్వు కాదనకు. నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. నువ్వు తీసుకునే ఈ ఒక్క నిర్ణయం.. ఈ ఇంటిని ప్రశాంతంగా ఉంచుతుంది అంటాడు భరత్.
దీంతో అసలు నిజం చెప్పేస్తుంది సిరి. సీతక్క ముందే ఆ త్యాగం చేసిందని.. రిషి కన్నతల్లి శైలూ కాదు.. సీతక్క అని చెబుతుంది సిరి. దీంతో భరత్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
This website uses cookies.