Vadinamma 17 Nov Today Episode : పోట్లాడుకున్న లక్ష్మణ్, భరత్.. ఉమ్మడి కుటుంబం ముక్కలు.. రఘురామ్, సీత షాక్

Vadinamma 17 Nov Today Episode : వదినమ్మ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 నవంబర్ 2021, బుధవారం ఎపిసోడ్ 702 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి.. సీతక్క కన్నకొడుకు అనే నిజాన్ని భరత్ కు సిరి చెప్పేస్తుంది. అందుకే పెద బావ అలా చేస్తున్నాడు అని చెబుతుంది. రిషి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు అంటుంది. పెద బావకు కావాల్సింది రిషి. తన కన్నకొడుకు. వైదేహి కాదు.. అని అసలు నిజం చెబుతుంది సిరి.

vadinamma 17 november 2021 full episode

ఉదయమే శైలూ రిషికి అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఇంతలో తనకు ఫోన్ వస్తుంది. రిషిని వదిలేసి ఫోన్ మాట్లాడుతుంది. బాబు ఏడుస్తుండటంతో భరత్ చూసి బాబును తీసుకొని వెళ్లి తన అన్నయ్యకు ఇస్తాడు. వద్దురా.. శైలూకు ఇవ్వు అంటాడు. బాబు ఏడుస్తున్నాడు. నువ్వు చూసుకో అన్నయ్య.. నేను ఇప్పుడే వస్తాను అంటాడు. వద్దన్నా వినకుండా.. బాబును ఇచ్చేసి వెళ్తాడు భరత్. దీంతో బాబుతో కాసేపు సరదాగా ఆడుకుంటాడు రఘురామ్. దీంతో భరత్ చాలా సంతోషిస్తాడు.

ఫోన్ మాట్లాడిన తర్వాత బాబు కోసం చూస్తుంది శైలూ. కానీ.. బాబు కనిపించడు. దీంతో షాక్ అవుతుంది. రిషి అంటూ బయటికి వెళ్తుంది. బయట.. రఘురామ్ రిషితో ఆడిపించడం చూసి ఇదేనా మీ పెద్దరికం. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధానం ఇదేనా అంటుంది. అందరూ అక్కడికి వస్తారు.

నిలబెట్టుకోనప్పుడు మాటివ్వడం ఎందుకు మోసం చేయడం ఎందుకు. ఏదోలా మేం గడప దాటకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అంటుంది శైలూ. నేను బాబును తీసుకురాలేదమ్మా. నన్ను నమ్ము అంటాడు రఘురామ్. అయినా వినకుండా బాబును లాక్కుంటుంది శైలూ.

Vadinamma 17 Nov Today Episode : మళ్లీ పిచ్చిదానిలా ప్రవర్తించిన శైలూ

ఏమైంది శైలూ అని అడుగుతాడు లక్ష్మణ్. నిజంగా బాబును నేను తీసుకోలేదు. బాబు ఏడుస్తున్నాడు అని చెప్పి భరత్ నాకు ఇచ్చి వెళ్లాడు అని చెబుతాడు రఘురామ్. అయినా వినరు. శైలూ అయితే పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. దీంతో ఏం చేయాలో రఘురామ్ కు అర్థం కాదు.

మీరెవ్వరూ నా బాబును ముట్టుకోవడానికి వీలులేదు అంటుంది. మీరంతా ఒక్కటే దొంగలు అంటుంది. ఇంతలో అక్కడ గొడవ జరగడం చూసి భరత్ అక్కడికి వస్తాడు. అసలు దీనంతటికీ కారణం నువ్వేరా అని భరత్ చెంప చెళ్లుమనిపిస్తాడు లక్ష్మణ్.

లక్ష్మణ్.. ఏంట్రా ఇది. వాడిని ఎందుకు కొట్టావు అంటాడు. మరి ఏం చేయమంటావు అన్నయ్య. నా కోపం, నా బాధ ఎవరి మీద చూపించాలి. నిజానికి తప్పంతా నీది. అలాగని నిన్ను కొట్టలేను కదా అంటాడు లక్ష్మణ్. దీంతో రఘురామ్ షాక్ అవుతాడు.

దీంతో భరత్ కు కోపం వస్తుంది. ఇద్దరూ కలిసి కొట్టుకుంటారు. పోట్లాడుకుంటారు. అస్సలు వినరు. దీంతో ఏం చేయాలో ఎవ్వరికీ అర్థం కాదు. సీత సీరియస్ గా ఇద్దరికి వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఇంట్లో గొడవలు మళ్లీ మొదలవుతాయి. లక్ష్మణ్ ను భరత్ ఇష్టం ఉన్నట్టు తిట్టేస్తాడు. ఉమ్మడి కుటుంబం కాస్త ముక్కలు అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Fish Venkat : ఫిష్ వెంకట్‌కు అండగా తెలంగాణ ప్రభుత్వం..చికిత్స ఖర్చులు భరిస్తామన్న మంత్రి..!

Fish Venkat  : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…

11 seconds ago

Rajendra Prasad : మ‌ళ్లీ నోరు జారిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. నెట్టింట తెగ ట్రోలింగ్

Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…

42 minutes ago

Relationship : మీ భార్య మిమ్మల్ని వదిలించుకోవాలి అని ఆలోచిస్తుందనే విషయం… ఈ 5 సంకేతాలతో తెలిసిపోతుంది…?

Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…

4 hours ago

Meat : మాంసం రుచిగా ఉండాలని ఇలా వండారో… మీరు ప్రమాదకరమైన వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే…?

Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…

5 hours ago

Health : పురుషులకు ఆ విషయంలో… భారత్ లో 28 మందిని వేధిస్తున్న ఒకే ఒక సమస్య… కారణం ఇదేనట…?

Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…

6 hours ago

Nithin : నాని తిరస్కరించిన కథలతో నితిన్ ప‌రాజయాలు.. ‘తమ్ముడు’ తర్వాత ‘ఎల్లమ్మ’పై సందేహాలు..!

Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…

7 hours ago

Healthy Street Food : ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది… అదేనండి…స్ట్రీట్ ఫుడ్ వీటి రూటే సపరేట్…?

Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…

8 hours ago

Lucky Bhaskar Sequel : ల‌క్కీ భాస్క‌ర్ సీక్వెల్ క‌న్‌ఫాం చేసిన ద‌ర్శ‌కుడు.. ఎలా ఉంటుందంటే..!

Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…

9 hours ago