Vadinamma 24 october 2021 episode highlights
Vadinamma 25 Oct Tomorrow Episode : వదినమ్మ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ప్రసారం కాదు. సోమవారం ప్రసారం అవుతుంది. 25 అక్టోబర్ 2021, సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసు కదా. శనివారం ఎపిసోడ్ లో రఘురాం, సీత పెళ్లి రోజు వేడుక ఘనంగా జరుగుతుంది. అందరు బంధువులు వస్తారు. దీంతో ఇంట్లో అంతా సంతోషంగా ఉంటారు. కానీ.. రఘురాం ఇంట్లో అందరూ సంతోషంగా ఉండటం పార్వతి, దుర్గకు నచ్చదు. ఈ ఫ్యామిలీ అంత ఇంత సంతోషంగా ఉండటం కరెక్ట్ కాదు. వీళ్లు ఇంకో నెల రోజులు కూడా సంతోషంగా ఉండకూడదు అని అనుకుంటుంది పార్వతి.
Vadinamma 24 october 2021 episode highlights
ఇంతలో శైలూ నాన్న వస్తాడు. దీంతో శైలూ సీరియస్ అవుతుంది. మా ఇంటికి రాకూడదు అని చెబుతుంది శైలూ. అల్లుడు పిలిచానని వచ్చాను అను చెబుతాడు తన నాన్న. రఘురామ్ ఇంతలో కలగజేసుకొని మీ నాన్న మారుతాడని నేను కూడా అనుకోవడం లేదు. కానీ.. ఆయన మన ఇంటికి వచ్చిన అతిథి. ఆయన్ను పలకరించాలి. కానీ.. అలా అవమానించకూడదు అంటాడు రఘురాం. దీంతో రండి లోపలికి అని చెబుతుంది శైలు. లక్ష్మణ్ కూడా శైలూకు చెబుతాడు. బంధాలను దూరం చేసుకోవడం చాలా తేలిక కానీ.. వాటిని కలుపుకోవడమే చాలా కష్టం అని అంటాడు. నీకు నీ పుట్టినిల్లును దూరం చేయడం నాకు ఇష్టం లేదు అంటాడు లక్ష్మణ్. మొత్తానికి అందరూ చాలా సంబురపడిపోతారు. ఘనంగా రఘురాం, సీత పెళ్లి రోజు జరుగుతుంది.
సాయంత్రం కూడా వాళ్ల పెళ్లి రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు అందరూ. దీంతో రఘురాం, సీత షాక్ అవుతారు. అందరూ వచ్చి వాళ్లను ఆశీర్వదిస్తారు. ఇంతలో రామా వాళ్ల పెళ్లి వేడుకకు వస్తాడు. అన్నయ్య, వదినమ్మ పెళ్లి రోజు రాకుండా ఎలా ఉంటాను అని చెప్పి భరత్ తో చెబుతాడు. రామా వెళ్లి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతాడు. జానకి రాలేదా అని అడుగుతుంది సీత. వేరే పని ఉండి ఊరికి వెళ్లి వస్తున్నా అని చెబుతాడు రామా.
మా ఉమ్మడి కుటుంబాన్న ముక్కలు కాకుండా చేసింది నువ్వే. నువ్వే మా కుటుంబాన్ని కాపాడావు అని రామాతో అంటాడు రఘురాం. వాళ్లకు మీరంటే ప్రాణం.. ఎప్పుడూ మీ గురించే మాట్లాడేవారు అని రఘురాంతో రామా చెబుతాడు. ఇంతలో మైకు తీసుకొని రామా.. రఘురాం, సీత గురించి చెబుతాడు. మా అన్నయ్య, వదిన సీతారాముల్లాండి వారని చెబుతాడు.
Vadinamma 24 october 2021 episode highlights
ఆ తర్వాత నైట్.. మరోసారి రఘురాం, సీత ఫస్ట్ నైట్ కు ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ నైట్ లో సీతతో ఎమోషనల్ అవుతాడు రఘురాం. అన్నీ ఇచ్చిన ఆ దేవుడు నాకు పిల్లలను ఎందుకు ఇవ్వలేదని రోజూ అనిపిస్తుంది. ఈ గుండె అలా అనుకున్నప్పుడల్లా బరువెక్కుతుంది. ఒక్కోసారి ఈ గుండె ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది అని అంటూ కుప్పకూలిపోతాడు రఘురాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.