vadinamma 28 october 2021 full episode
Vadinamma 28 Oct Today Episode : వదినమ్మ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 అక్టోబర్, 2021, గురువారం 685 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రఘురామ్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. శైలూ కోసం మన బిడ్డను త్యాగం చేశానని రఘురామ్ తో అంటుండగా.. శైలూ వింటుంది. ఒక ప్రాణం పోయడానికి ఇంకో ప్రాణం తీస్తావా సీతక్కా అంటుంది. సీత చెప్పిన విషయం గురించి తెలిసి తన అత్తయ్య కూడా మాట్లడదు. ఇంటికి వచ్చాక అన్నయ్యకు ఎలా ఉంది అని అందరూ అడుగుతారు. కానీ.. సీత ఏం మాట్లాడదు. సీత మౌనంగా ఉండటం చూసి అందరూ షాక్ అవుతారు. బావ బాగానే ఉన్నాడు. స్పృహ కూడా వచ్చింది. ముందు మీరు అందరూ అన్నం తినండి అంటుంది సీత.
vadinamma 28 october 2021 full episode
అక్క.. నేను వడ్డిస్తాను అంటుంది సిరి. అత్తయ్య భోజనం చేసిందా అంటే లేదు అంటుంది. రాజేశ్వరి చాలా బాధపడుతూ కూర్చుంటుంది. నా మీద కోపం భోజనం మీద చూపించడం ఎందుకు అత్తయ్య అంటుంది సీత. నీ మీద కోపం చూపించడానికి నేను ఎవరిని. నాకు, నీకు సంబంధం ఏంటి? అంటుంది రాజేశ్వరి. ఏ సంబంధం లేదా అత్తయ్య అంటుంది. లేదు అంటుంది. నీ చూపులతో, మాటలతో మాయ చేస్తావు. మోసం చేస్తావు. నీకు స్వార్థం ఎక్కువ. నీ వైపు నుంచి తప్పితే ఎదుటివారి నుంచి ఆలోచించవు అంటుంది.
లక్ష్మణ్, శైలు ఇప్పుడు ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం రిషి. అమ్మా అనే పిలుపు లేకుండా ఉంటే శైలూ ఇలా ఉండేది కాదు.. అంటే ఏం.. అమ్మా అని నీకు పిలిపించుకోవాలని లేదా? అంటుంది. నవమాసాలు మోసి.. తల్లి పేగు తెంపుకొని పుట్టిన బిడ్డను వదిలేసుకొని నువ్వు తల్లి ప్రేమ గురించి మాట్లాడుతున్నావా? అంటూ సీతపై రాజేశ్వరి సీరియస్ అవుతుంది.
రిషి నీ కొడుకు అని నువ్వు దాచిన నిజం.. నన్ను నన్నుగా ఉండనీయడం లేదు అంటుంది రాజేశ్వరి. ఎప్పటికైనా ఆ నిజం బయట పడాల్సిందే అంటుంది రాజేశ్వరి. నేనేమీ చిన్నపిల్లను కాదు.. వాళ్లలా నీ మాటలు నమ్మి భోం చేయడానికి.. పెద్దోడికి స్పృహ వచ్చిందా? ఇలా అబద్ధాలు చెప్తూ.. మోసం చేస్తూ ఎన్నాళ్లిలా అందరినీ మభ్యపెడతావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది రాజేశ్వరి.
సీతక్కా నిన్ను నువ్వే ఎందుకు శిక్షించుకుంటున్నావు. తప్పు చేస్తున్నావు. బావను కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తున్నావు.. అంటూ తనలో తానే అనుకుంటుంది సిరి. ఇంతలో భరత్ అక్కడికి వస్తాడు. ఏమైంది సిరి.. ఎందుకు అలా ఉన్నావు అంటాడు. నాకేమైంది. మంచిగనే ఉన్న అంటుంది సిరి. నా దగ్గర నువ్వు ఏదో నిజం దాస్తున్నావు. ఏదో చెప్పాలని చెప్పలేక ఇబ్బంది పడుతున్నావు అని అనిపిస్తుంది అంటాడు భరత్.
vadinamma 28 october 2021 full episode
సీత, రాజేశ్వరి ముభావంగా ఉండటంతో అసలు ఏమైందో అని అందరూ అనుకుంటారు. లక్ష్మణ్, శైలూ ఇద్దరూ మాట్లాడుకుంటారు. అన్నయ్యను దక్కించుకోవాలంటే.. మనం ఒక త్యాగం చేయాల్సిందే అంటాడు లక్ష్మణ్. ఏంటది అని అడుగుతుంది శైలూ. మన రిషీని అన్నయ్య, వదినకు ఇచ్చేద్దాం అంటాడు లక్ష్మణ్. కానీ.. శైలూ ఒప్పుకోదు. నా కొడుకును నేను ఇవ్వను.. అస్సలు ఇవ్వను అంటుంది శైలూ. మనకు రిషి పుట్టలేదు అనుకుందాం. వదినమ్మ బిడ్డ అని అనుకుందాం అంటాడు కానీ.. అస్సలు శైలూ వినదు. వాళ్లు మనకోసం ఎంతో చేశారు కానీ.. మనం ఈమాత్రం కూడా చేయకపోతే ఎలా.. అంటాడు లక్ష్మణ్. కానీ.. శైలూ నావల్ల కాదు అని చెప్పి వెళ్లిపోతుంది.
కట్ చేస్తే రిషిని తీసుకొని రాజేశ్వరి ఆసుపత్రికి వస్తుంది. రఘురామ్ స్పృహ కోల్పోయి ఉంటాడు. దీంతో నీ కన్న బిడ్డ వచ్చాడు లేవరా అంటుంది రాజేశ్వరి. శైలూకు పురిట్లోనే బిడ్డ చనిపోతే.. తన బిడ్డను త్యాగం చేసిందిరా. రిషి నీ బిడ్డేరా అని అసలు నిజం చెబుతుంది రాజేశ్వరి. దీంతో రిషిని తీసుకొని ముద్దాడుతాడు రఘురామ్. రిషిని రఘురామ్ తీసుకొని ముద్దాడటం శైలూ చూస్తుంది. ఏడుపు ఆపుకోలేకపోతుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది.. అయితే ఇదంతా కల. కల కంటుంది సీత. వెంటనే లేచి.. రిషి ఎక్కడున్నాడో చూస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
This website uses cookies.