vadinamma 30 october 2021 full episode
Vadinamma 30 Oct Today Episode : వదినమ్మ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 అక్టోబర్ 2021, శనివారం ఎపిసోడ్ 687 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రఘురామ్ బతికే పరిస్థితి తక్కువ అని డాక్టర్లు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో అందరు కూతుళ్ల తల్లిదండ్రులు రఘురామ్ ఇంటికి వచ్చి రఘురామ్ బతకడు.. మాతోని రండి.. అని తమ కూతుళ్లను తీసుకెళ్లేందుకు వస్తారు. దీంతో మేము రాము.. అని శైలూ, శిల్ప, సిరి.. ఒక్క మాట మీద చెబుతారు. దీంతో జనార్ధన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
vadinamma 30 october 2021 full episode
నా చెల్లెల్లు నా నమ్మకాన్ని నిలబెట్టారు. ఎవరి మనసులో ఏముందో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని భయపడ్డాను అంటే.. నువ్వు ఎక్కడ మమ్మల్ని పొమ్మంటావో అని మేము కూడా భయపడ్డాం సీతక్క అంటుంది సిరి. అలాంటి రోజు రాదు.. అంటుంది సీత. ఇంతలో రఘురామ్ కు ఎలా ఉందని అందరూ అడుగుతారు. రాజేశ్వరి కూడా లక్ష్మణ్ ను అడుగుతుంది. దీంతో లక్ష్మణ్ ఏం మాట్లాడడు. రాజేశ్వరి సీరియస్ గా అడగడంతో అన్నయ్య బాడీ ట్రీట్ మెంట్ కు సహకరించడం లేదని డాక్టర్లు చెప్పారు అంటాడు. ప్రస్తుతానికి ఏ ప్రమాదం లేకపోయినా అన్నయ్య మనసులో ఉన్న బాధను తీర్చాలని డాక్టర్లు చెప్పారు అంటాడు లక్ష్మణ్. దీంతో అందరూ షాక్ అవుతారు.
మరి.. మీరేం చెప్పారు.. మా అన్నయ్యను బతికించకపోతే డాక్టర్ మీద ఒట్టే అని డాక్టర్ గారిని ఒప్పించపోయారా? అంటుంది రాజేశ్వరి. దీంతో తన మాటలు పట్టించుకోకండి అని సిరి అంటుంది. సీత ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది. దీంతో లక్ష్మణ్ కూడా టెన్షన్ పడతాడు.
సీత బాధపడుతూ కూర్చుంటే.. రాజేశ్వరి వచ్చి సీతను నిలదీస్తుంది. నీ కొడుకును నువ్వు వేరే వాళ్లకు ఇచ్చి పెద్ద త్యాగం చేశానని అనుకుంటున్నావా? పెద్దోడు ఇఫ్పుడు అలా అవ్వడానికి కారణం నువ్వే. ఈ కుటుంబం కోసం పెద్దోడు చేయని త్యాగం లేదు. కానీ.. నువ్వు మాత్రం వాడికి తెలియకుండా వాడి బిడ్డను త్యాగం చేసి వాడిని మోసం చేశావు అని రాజేశ్వరి.. సీతతో అంటుంది. నువ్వు ఏమైతే నాకేంటి. నా కొడుకు కన్నీళ్లకు కారణమైన నీగురించి నేను ఎందుకు ఆలోచించాలి… ఎందుకు బాధపడాలి. సీత నీకు దండం పెడతా. నాకొడుకును నాకు దూరం చేయకు. రిషి తన బిడ్డ అని చెబితే.. పెద్దోడికి బతుకు మీద ఆశ పుడుతుంది. ఆ నిజం చెప్పి వాడిని బతికించు.. అని రాజేశ్వరి సీతను కోరుతుంది. నా కొడుకును బతికించు.. అంటూ బతిమిలాడుతుంది.
vadinamma 30 october 2021 full episode
దీంతో సీత.. రిషీ దగ్గరికి వెళ్తుంది. నేను ఒప్పు అనుకున్నది ఇప్పుడు తప్పుగా అనిపిస్తోంది. ఏం చేయాలిరా నేను.. ఇచ్చిన దానాన్ని తిరిగి తీసుకోవడం కన్నా పాపం లేదు. నిజం మీ నాన్నకు చెప్పేయాలా అని వేలు చూపిస్తే.. రిషి పట్టుకుంటాడు. దీంతో నువ్వు చెప్పినట్టే నిజం మీ నాన్నకు చెప్పేస్తాను. మీనాన్నను బతికించుకుంటాను అని అంటుంది సీత.
కట్ చేస్తే జనార్ధన్.. ఇంటికి వస్తాడు. సీత మాటలే గుర్తొస్తున్నాయి. ఎన్ని మాటలు అన్నది. దాన్ని వదిలిపెట్టను.. వదిలిపెట్టనురా అంటాడు జనార్ధన్. ఆ సీత ఎప్పుడు దొరుకుతుందా? ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుందామా? అని ఎదురు చూస్తున్నాను. సమయం దొరుకుతుంది.. అప్పుడు చెప్తా సీత పని అంటాడు జనార్ధన్. అసలే శైలూకు శత్రువు అయ్యావు.. ఇంకా పగ పెంచుకుంటే ఎట్లా బావ అంటాడు తన బావమరిది. ఏదైతే అది అయింది.. తెగిస్తాను అంటాడు జనార్ధన్. ఎంత దూరం అయినా వెళ్తాను. ఆ రఘురామ్ గాడు పొరపాటున కూడా బతక్కూడదు. వాడు పోతేనే వాడి కుటుంబం చెల్లాచెదురు అవుతుంది. అప్పుడు ఉంటుందిరా అసలైన మజా అంటాడు జనార్ధన్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
This website uses cookies.