vadinamma 8 november 2021 full episode
Vadinamma 8 Nov Today Episode : వదినమ్మ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 నవంబర్, 2021, సోమవారం ఎపిసోడ్ 694 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బాబును ఇంకా తీసుకొని రాకపోయేసరికి శైలూ బాధపడుతుంది. అన్నం కూడా తినదు. బాబు నేను కనిపించకపోతే ఉండలేడు. నేను పాలు తాగించాలి. ఏడుపు ఆపడు వాడు. పొద్దున నుంచి బాబు లేకుండా ఎలా బతకాలి అని అనుకుంటుండగానే రిషి ఏడుపు వినిపిస్తుంది శైలూకు. రిషిని తీసుకొని రఘురామ్ ఇంటికి వస్తాడు. రఘురామ్ నుంచి పిల్లాడిని తీసుకొని ఇంకోసారి ముట్టుకోవద్దు అని చెబుతుంది శైలూ. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతకుముందు వరకు బాగానే ఉన్నాడు కానీ.. ఇప్పుడే అస్సలు ఏడుస్తున్నాడు. బాబుకు డ్రెస్ కొనిద్దామని బట్టల షాపునకు వెళ్లాం. దొరబాబులా కనబడే డ్రెస్ కావాలనిపించి ఈ డ్రెస్ కొన్నాను అంటుంది.
vadinamma 8 november 2021 full episode
డ్రెస్ ఎలా ఉందమ్మా శైలూ అంటాడు రఘురామ్. దీంతో బాబుకు ఉక్కపోసి చిరాకుపడి ఏడుస్తున్నాడు అని ఆ డ్రెస్ ను విప్పేస్తుంది. ఏ సీజన్ కు తగ్గట్టు ఆ సీజన్ డ్రెస్సులు వేయాలి అంటుంది. దయచేసి ముట్టుకోకండి అని అంటుంది. బావ గారు మాకు చెప్పాల్సిన మీరు మాతో చెప్పించుకుంటున్నారేంటి.. అంటుంది శైలూ. అసలు చెప్పాపెట్టకుండా నా బాబును ఎత్తుకుపోవడం ఏంటి.. అంటుంది శైలూ. నేను ఎక్కడికి తీసుకెళ్లాను. గుడికి, గుడి లాంటి మన షాపునకే కదా అంటాడు రఘురామ్.
లక్కీ.. బావ గారికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. వీడికి ఏదైనా అయితే నేను ఎలా బతకాలి అంటుంది శైలూ. వీడు నా బాబు. ఎవ్వరూ ముట్టుకోవద్దు అంటూ కళ్లు తిరిగి పడిపోతుంది శైలూ. తేరుకోగానే మళ్లీ శైలూను లాగేసుకుంటుంది శైలూ.
చూస్తున్నావా అన్నయ్య. శైలూ పరిస్థితి చూస్తున్నావు కదా. నీ పాటికి నువ్వు బాబును తీసుకొని వెళ్లావు. శైలూ ఉదయం నుంచి బాబు కోసం వెయిట్ చేస్తోంది. నీ ముఖంలో కొంచెం కూడా పచ్చత్తాపం లేదు అంటాడు. దీంతో లక్ష్మణ్.. మీ అన్న రిషిని ప్రేమగా చూసుకున్నాడు. అది తప్పా. చిన్నప్పుడు మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నాడో.. ఇప్పుడు రిషిని అలా ప్రేమగా చూసుకున్నాడు. దానికి తప్పు పడుతున్నారా? ఏదో సరదాగా బాబుకు బట్టలు కొంటే దానికి కూడా ఇంత రాద్ధాంతం చేస్తున్నారా? అంటుంది సీత. అసలు ఈ బాబు మీద మీకు హక్కే ఉండేది కాదు.. అంటుంది శైలూ. నేను కన్నబిడ్డ మీద నాకు హక్కు లేకపోవడం ఏంటి సీతక్క అంటుంది శైలూ. దీంతో సీతకు ఏం చేయాలో అర్థం కాదు. నేను చెప్పడం ఏంటి.. మీకు తెలియదా.. మీ అందరిలాగే రిషి కూడా మా బిడ్డే.. అంటుంది సీత. మా బిడ్డ.. అంటుంది. దీంతో రఘురామ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
వదినమ్మ.. రిషి మీద నీకు హక్కు ఉంది. కాదనడం లేదు కానీ.. శైలూ రిషి కన్నతల్లి కదా. శైలూ బాబు మీద ఎంతో అటాచ్ మెంట్ పెట్టుకొని ఉంది. అది గుర్తు పెట్టుకోండి వదినమ్మ అని అంటాడు లక్ష్మణ్. తర్వాత తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. రఘురామ్ మళ్లీ సీత మీద సీరియస్ అవుతాడు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక రోజు మొత్తం నేను నా కొడుకుతో గడిపాను అంటాడు రఘురామ్.
vadinamma 8 november 2021 full episode
తర్వాత రాత్రి అవుతుంది. అందరూ నిద్రపోతారు. ఉదయం లేచి శైలూ ఫ్రెష్ అయి వచ్చేసరికి రిషి కనిపించడు. రిషిని తీసుకొని రఘురామ్ బయట ఆడుతూ ఉంటాడు. అక్కడ రిషితో రఘురామ్ ఆడుకోవడం చూసి శైలూకు తీవ్రంగా కోపం వస్తుంది. వెంటనే రిషిని గుంజుకుంటుంది. చెప్పకుండా బాబును తీసుకెళ్లొద్దు అని చెప్పాను కదా బావ గారు.. అంటుంది. బాబును శైలూ తీసుకోగానే రిషి ఏడుస్తుంటాడు. రఘురామ్ తట్టుకోలేడు. అందరూ రిషి ఏడుపు చూసి అక్కడికి వస్తారు. మీ దగ్గర ఉంటేనేమో బాగానే ఉంటున్నాడు. నా దగ్గరికి రాగానే తెగ ఏడ్చేస్తున్నాడు. ఈ అమ్మ చేదు అయిపోయిందా.. అంటూ రిషి మీద సీరియస్ అవుతుంది శైలూ. ఆ తర్వత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
AP Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…
Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి Rajitha…
This website uses cookies.