Home » Entertainment » Vadinamma Serial 7 November 2021 Episode
Entertainment

Vadinamma 7 Nov Today Episode : రిషి మీద మీకు ఏమాత్రం హక్కు లేదు అని శైలూ, లక్ష్మణ్ కు చెప్పిన సీత.. ఈ విషయం తెలిసి శైలూ షాకింగ్ నిర్ణయం?

Authored By
Varun G
The Telugu News | Published on: November 7, 2021, 12:00 pm
Advertisement

Vadinamma 7 Nov Today Episode : వదినమ్మ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఆదివారం ప్రసారం కాదు కాబట్టి.. సోమవారం 8 నవంబర్ 2021, 694 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శైలూ.. రిషి కోసం చాలా టెన్షన్ పడుతుంది. ఉదయం నుంచి రిషి కనిపించకపోయేసరికి.. తనకు పిచ్చి పడుతుంది. మరోవైపు రఘురామ్ బాబుకు షాపులో పొట్లాలు కట్టి నేర్పించడం చూసిన పార్వతి.. ఇంటికి వెళ్లి మరీ.. ఆ విషయాన్ని శైలూకు చెబుతుంది. దీంతో శైలూ ఆ విషయం విని షాక్ అవుతుంది. వెంటనే పరిగెత్తుకుంటూ షాపునకు వస్తుంది. కానీ.. అక్కడ చూస్తే రఘురామ్, బాబు ఉండరు. దీంతో ఎక్కడికి వెళ్లారు ఇద్దరూ అని భరత్ ను అడుగుతుంది శైలూ.

Advertisement

vadinamma serial 7 november 2021 episode

అసలు.. బావ గారు రిషికి పొట్లాలు కట్టించడం ఏంటి.. అసలు ఇదేం పని. ఇంతకీ వీళ్లు ఎక్కడికి వెళ్లారు. కాల్ చేస్తాను ఉండు అని ఫోన్ చేస్తుంది కానీ.. ఫోన్ లిఫ్ట్ చేయడు రఘురామ్. పెద్దన్నయ్య బాబును ఇంటికే తీసుకెళ్లి ఉంటాడు అనగానే వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది శైలూ. కానీ.. ఇంటి వద్ద రఘురామ్ ఉండడు. ఇంటికి వచ్చారా అని అడుగుతుంది శైలూ. కానీ.. ఇంటికి రాలేదు.. నువ్వు షాపునకు వెళ్లావు కదా అక్కడ బాబు లేడా అని అడుగుతుంది సీత.

Advertisement

మీరు ఇలాగే చేస్తే నా బాబును తీసుకొని నేను పారిపోతాను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది శైలూ. పొద్దున నుంచి నా బాబును నా దగ్గర లేకుండా చేశారు. ఎక్కడెక్కడో తిప్పుతున్నారు. బాబును తీసుకొని బయటికి వెళ్లిన బావ గారు ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి.. అని టెన్షన్ పడుతుంది శైలూ.

Vadinamma 7 Nov Today Episode : రాత్రి పూట రిషిని తీసుకొని ఇంటికి వచ్చిన రఘురామ్

దీంతో సిరి ఒకసారి బావకు ఫోన్ చేయ్ అంటుంది సీత. తను ఎందుకు చేయాలి అక్క. నువ్వు కాల్ చేసి కనుక్కోవచ్చు కదా అంటుంది. దీంతో సీతే కాల్ చేస్తుంది. కానీ.. ఫోన్ ఎత్తగానే బావ అని అనగానే ఫోన్ కట్ చేస్తాడు రఘురామ్. దీంతో మళ్లీ చేయ్ సీతక్క.. మళ్లీ చేయ్ అంటుంది శైలూ. కానీ.. సీత ఫోన్ చేయలేకపోతుంది. వెంటనే సిరి ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తుంది. కానీ.. ఫోన్ లిఫ్ట్ చేయడు రఘురామ్.

Advertisement

vadinamma serial 7 november 2021 episode

చీకటి పడుతుంది. అయినా కూడా రఘురామ్ ఇంకా ఇంటికి రాడు. పొద్దున నుంచి ఏం తినలేదు.. ఇలా అయితే ఎలా.. బాబు వస్తాడులే.. అని లక్ష్మణ్ సర్దిచెప్పినా శైలూ వినదు. కట్ చేస్తే.. రఘురామ్ బాబును తీసుకొని ఇంటికి వస్తాడు. బాబు రాగానే వెంటనే తీసుకొని ఎత్తుకుంటుంది. మీరు దయచేసి రిషిని ఇంకోసారి ముట్టుకోవద్దు అంటుంది శైలూ. మీరే కాదు.. నా బాబును ఎవ్వరూ ముట్టుకోవద్దు అని చెప్పి స్పృహ తప్పి పడిపోతుంది శైలూ.

ఇంతలో లక్ష్మణ్.. రఘురామ్ మీద సీరియస్ అవుతాడు. చూస్తున్నావు కదా అన్నయ్య.. శైలూ పరిస్థితి చూస్తున్నావు కదా అంటాడు లక్ష్మణ్. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అంటుంది సీత. అసలు నీకు బాబు మీద అర్హతే లేదు.. అంటూ అందరికీ అసలు నిజం చెప్పేస్తుంది సీత. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి