Vaishnav Chaitanya : బేబి సినిమాలో హీరోయిన్గా నటించి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిన వైష్ణవి చైతన్య. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు చేస్తూ మెరిసిన తెలంగాణ హీరోయిన్ వైష్ణవి చైతన్య.. ‘బేబీసతో సంచలన విజయం అందుకుంది. ఈ సినిమాలో రెండు పార్శ్వాలు కలిగిన పాత్రలో వైష్ణవి నటనకి అందరి ప్రశంసలు దక్కాయి. ‘అల వైకుంఠపురములో’, ‘వలిమై’లో హీరోల చెల్లి పాత్రలో కనిపించి సందడి చేసిన వైష్ణవికి బేబి సినిమాలో హీరోయిన్గా నటించే అదృష్టం దక్కింది. వచ్చిన అవకాశాన్ని ఇప్పుడు ఈ భామ సద్వినియోగం చేసుకొని ఇప్పుడు వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పుడు వైష్ణవి రెండు లేదా మూడు సినిమాలతో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.
వైష్ణవి చైతన్యకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తన పాటలతో పాటు, టిక్ టాక్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో ఫుల్ ఫేమస్ తెచ్చుకుంది. ఈమెలోని టాలెంట్‌ని సాయి రాజేష్ గుర్తించి మంచిగా ఉపయోగించుకున్నాడు. వైష్ణవి నటనకి ఫిదా కాని వారు లేరు. అయితే రీసెంట్గా వైష్ణవి చైతన్య ఓ ఇంటర్వ్యూలో తను పడ్డ బాధల గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. పదో తరగతి నుండే ఎన్నో బాధలు పడ్డట్టు చెప్పిన వైష్ణవి చైతన్య.. ఫ్యామిలీ బాధ్యతలని తీసుకున్నట్టు పేర్కొంది. పూట గడవడం కోసం చాలా కష్టపడేదానిని అని పేర్కొంది.
బర్త్ డేలకి, పెళ్లిళ్ల ఈవెంట్లకి రాత్రిళ్లు వెళ్లి డ్యాన్స్‌లు చేసే దానిని అని కూడా వైష్ణవి పేర్కొంది. బర్త్ డే పార్టీలకి రాత్రిళ్లు వెళ్లి డ్యాన్స్ చేస్తే రూ.700లు ఇచ్చే వారని, ఆ మనీతో అమ్మ రైస్ కొనుక్కొచి మా కడుపు నింపేదని వైష్ణవి చాలా ఎమోషనల్‌గా పేర్కొంది. అయితే యూట్యూబ్ వీడియోలు చేసే సమయంలో డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా సపరేట్ గది ఉండేది కాదని వాష్ రూమ్‌లో చేంజ్ చేసుకోవల్సి వచ్చేదని తెలియజేసింది. నా బాధలు చూసి అమ్మ చాలా ఏడ్చేసింది. ఓ మూవీలో చిన్న పాత్ర చేయగా, ఆ సమయంలో వాష్ రూం కోసం కార్ వ్యాన్ వాడుకోవచ్చా అని అడిగితే అనరాని మాటలు అన్నారంటూ వైష్ణవి చాలా బాధతో చెప్పుకొచ్చింది. ఆమె మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్‌లోని…
This website uses cookies.