Vaishnav Tej About on Rakul Preeth singh
Vaishnav Tej : మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం‘ఉప్పెన’తోనే సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాలో వైష్ణవ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తొలిచిత్రంతోనే వైష్ణవ్ తేజ్ మేనమామలు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు నిలబెట్టాడని, మామలకు తగ్గ అల్లుడుగా నిలిచాడని మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.‘ఉప్పెన’ సినిమా తర్వాత మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ‘కొండపొలం’ శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూస్‌లో డైరెక్టర్ క్రిష్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, లిరిసిస్ట్ చంద్రబోస్, హీరో వైష్ణవ్ తేజ్ పాల్గొంటున్నారు.
Vaishnav Tej About on Rakul Preeth singh
ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో హీరో వైష్ణవ్ తేజ్ హాట్ కామెంట్స్ చేశాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ క్రిష్ వివరించాడు. హీరో వైష్ణవ్ తేజ్‌కు రకుల్ తో రొమాన్స్ చేయడం కంటే కూడా గొర్రెలు కాయడం ఈజీ అని, ఈ విషయాన్ని వైష్ణవ్ తేజ్ చెప్పాడని వివరించాడు. సన్నపురెడ్డి వెంకట రామి రెడ్డి రచించిన ‘కొండపొలం’ మూవీలో వైష్ణవ్ తేజ్ గొర్రెల కాపరి పాత్రలో నటించాడు. ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్ కోట శ్రీనివాసరావు, సాయిచంద్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రంలో గతంలో పోషించని పాత్రను బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ పోషించింది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే ఈ సినిమాలో ‘ఓబులమ్మ’గా రకుల్ నటించింది. తెరపైన ఓబులమ్మ, రవింద్ర కెమిస్ట్రీ చాలా బాగుంటుందని డైరెక్టర్ క్రిష్ చెప్పాడు.
Vaishnav Tej About on Rakul Preeth singh
ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందించారు. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’ చిత్రం చేస్తున్న సమయంలో కొంచెం గ్యాప్ దొరకగా, ఆయన అనుమతి తీసుకుని ‘కొండపొలం’ సినిమా తీసినట్లు డైరెక్టర్ క్రిష్ చెప్పాడు. ఇకపోతే మెగా హీరో వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని మెగా ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. వైష్ణవ్ తేజ్ త్వరలో గిరీశయ్య డైరెక్షన్‌లో ఓ చిత్రం చేయబోతున్నారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.