Home » Entertainment » Varun Dhawan Tells About His Crush On Sania Mirza
Entertainment

Sania Mirza : అసలే విడాకుల గోలలో ఉన్న సానియా మీర్జాకి బాంబు లాంటి న్యూస్ చెప్పిన స్టార్‌ హీరో..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: November 25, 2022, 7:00 pm
Advertisement

Sania Mirza : సెలబ్రిటీల జీవితం తెరిచిన పుస్తకం అని తెలుసు కదా. వాళ్లు ఏం చేసినా కూడా దాన్ని భూతద్దంతో చూస్తారు. చాలామంది సినీ, రాజకీయ, స్పోర్ట్స్ సెలబ్రిటీల జీవితాలపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ మీడియాలో పుడుతూనే ఉంటుంది. తాజాగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, తన భర్త షోయబ్ మాలిక్ ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతే కాదు.. షోయబ్ మాలిక్.. పాకిస్థాన్ మోడల్ అయేషాతో చనువుగా ఉంటూ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

Advertisement

అయితే.. ఇవన్నీ ఉత్త పుకార్లే అని.. వాళ్లిద్దరూ తమ దాంపత్య జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారని తేలిపోయింది. కట్ చేస్తే బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్.. సానియా మీర్జాను చూసి తన మనసు పారేసుకున్నాడట. సానియా మీర్జా కేవలం క్రీడాకారిణి మాత్రమే కాదు. తను చాలా అందంగా ఉంటుంది. హీరోయిన్లు కూడా తన కింద పనికిరారు. అందుకే.. తనను చూసి వరుణ్ ఫ్లాట్ అయిపోయాడట. ఈ విషయాన్ని ఇటీవల తన లేటెస్ట్ మూవీ తోడేలు ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ధావన్ చెప్పుకొచ్చాడు.

varun dhawan tells about his crush on sania mirza

Advertisement

Sania Mirza : నాకు సానియా మీర్జా అంటే పిచ్చి

ఇటీవల హైదరాబాద్ లో తోడేలు సినిమా ప్రమోషన్స్ ఈవెంట్ లో పాల్గొన్న వరుణ్ ధావన్.. తనకు సానియా మీర్జా అంటే పిచ్చి అని అన్నాడు. సానియా మీర్జాపై నాకు క్రష్ ఉండేది. తన అందాన్ని ఆరాధించేవాడిని. తను అప్పుడు ఒప్పుకొని ఉంటే నేను పెళ్లి చేసుకునేవాడిని. నేను సినిమాల్లో నటించకముందు ఒక ప్రొడక్షన్ కంపెనీలో నార్మల్ ఉద్యోగిగా పనిచేసేవాడిని. ఆ సమయంలోనే సానియా మీర్జాను మా ప్రొడక్షన్ కంపెనీలో చూశా. అప్పుడే ప్రేమలో పడిపోయా అని వరుణ్ ధావన్ తన మనసులో మాటను చెప్పుకొచ్చాడు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి