
varun tej goes to marriage
Varun Tej: మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలు అద్భుతమైన అభినయం కనబరుస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన విషయం తెలిసిందే. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ మంచి సినిమలు చేస్తున్న తాజాగా గని అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాను షెడ్యూల్ ప్రకారం గతేడాది జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని ప్రకటించింది చిత్రబృందం. ఆ తర్వాత ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రటించారు. ఆ తర్వాత ‘అన్నాత్తే’ (పెద్దన్న) పోటీలో ఉండటంతో ఈ సినిమాను డిసెంబర్ 3కు రీ షెడ్యూల్ చేసారు.
కానీ డిసెంబర్ 2న బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ మూవీ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా విడుదల కానుంది.ఇప్పటికే విడుదలైన టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ఈ చిత్రానికి నిర్మాత. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడిగా నటిస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొద్దిసేపటి క్రితమే గని ట్రైలర్ రిలీజ్ చేశారు. బాక్సింగ్ పంచ్ లాగే ట్రైలర్ సాలిడ్ గా, ప్రామిసింగ్ గా ఉంది. ట్రైలర్ లో యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ అన్ని పర్ఫెక్ట్ గా మిక్స్ అయ్యాయి.బాక్సింగ్ చాంపియన్ కావాలనుకునే ’గని’ నుంచి నువ్వు జీవితంలో బాక్సింగ్ ఆడనని అమ్మకు మాటిస్తాడు. మరి అమ్మ మాటను జవదాటి ఎలా బాక్సింగ్‌లో గని నేషనల్ ఛాంపియర్ అయ్యాడనేదే ‘గని’ మూవీ స్టోరీలా కనిపిస్తోంది.
varun tej stunning comments in ghani trentailer release ev
గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’ సినిమా స్టోరీనే కాస్తా అటు ఇటు మార్చి తెరకెక్కించారు. ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు బాలీవుడ్‌లో చాలానే తెరకెక్కాయి. ట్రైలర్ ఈవెంట్ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘మూడేండ్లుగా ఈ సినిమా కోసం కష్టపడ్డాం. ప్రేక్షకులకు మంచి సినిమాను ఇచ్చేందుకు గనిని రూపొందించాం. నిజనానికి నేను సినిమాల్లోకి రాకపోతే ఎక్కడో పోరంబోకులా తిరిగే వాడిని, నాకు సినిమా డిసిప్లయిన్ నేర్పించింది. బతకడం నేర్పించిందంటూ కొంత ఎమోషనల్ అయ్యాడు.’ వాస్తవానికి గని మూవీ కోసం వరుణ్ తేజ్ స్పెషల్ కోచ్ ను పెట్టుకొని ఎంతలా కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. ఇదే వరుణ్ కు ప్లస్ కానుంది. ఏప్రిల్ 8న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది అని తెలియజేశారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.