Venkatesh going to become a host for aha ott game show
Balakrishna : తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా వినోదంను ఆహా ఓటీటీ అలవాటు చేస్తోంది. ప్రతి ఒక్క తెలుగు వారి ఇంట్లో ఉంటున్న ఆహా ఇప్పటికే బాలయ్య అన్ స్టాపబుల్ తో అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. బాలయ్య ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ మొదటి సీజన్ ను ముగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 15 ఎపిసోడ్స్ తో ఈ సీజన్ ను ముగించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే బాలయ్య షో కు ఏమాత్రం తగ్గకుండా పై పెచ్చు బాలయ్య షో కు పోటీ అన్నట్లుగా విక్టరీ వెంకటేష్ తో ఒక షో ను చేయించేందుకు ఆహా టీమ్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆహా టీమ్ వారు ఒక సరికొత్త గేమ్ షో.
వెంకటేష్ తో చేసేందుకు గాను ప్లాన్ చేస్తున్నారు. వారు చేస్తున్న ఈ గేమ్ షో కు ఇప్పటికే వెంకటేష్ ఓకే చెప్పడం కూడా జరిగిందట. ప్రముఖ స్టార్ హీరోలు మరియు హీరోయిన్స్ కలిసి ఈ షో లో కనిపించబోతున్నారు. బాలయ్య మరియు ప్రముఖులు కలిసి చేసిన అన్ స్టాపబుల్ కు మంచి రేటింగ్ వచ్చింది. అందుకే వెంకటేష్ తో ఆహా వారు షో ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. హాట్ స్టార్ లో బిగ్ బాస్ ఓటీటీ ఎలా అయితే రాబోతుందో కాస్త అటు ఇటుగా వెంకటేష్ తో అదే తరహా లో ఈ షో ను నిర్వహించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.వెంకటేష్ కు ఉన్న ఆసక్తి ఏంటో తెలుసుకుని అల్లు అరవింద్ ఆ షో ను ప్లాన్ చేస్తున్నాడట. వెంకటేష్ ఆలోచనలు కూడా తీసుకుని షో ను ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Venkatesh going to become a host for aha ott game show
మొత్తానికి ఈ షో ను అల్లు అరవింద్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు. ఆహా కు మై హోమ్స్ రామేశ్వరరావు నిధులు భారీగా ఖర్చు చేస్తున్నాడు. కనుక కోట్లు కుమ్మరించి షో లను అల్లు అరవింద్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఎలా చేస్తేనేం ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్ మెంట్ మాత్రం దక్కుతుంది కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆహా ద్వారా వచ్చే ఆదాయం కన్నా పెడుతున్న పెట్టుబడి భారీగా ఉంది. అయితే భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకుని ఆహాకు భారీగా పెట్టుబడి పెడుతున్నట్లుగా చెబుతున్నారు. అల్లు అరవింద్ ఏం చేసినా కూడా చాలా ప్లాన్ తో చేస్తాడు. కనుక వెంకీ షో కూడా మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
This website uses cookies.