Home » Entertainment » Venu Swamy C0mments On Prabhas
Entertainment

Venu Swamy : ప్రభాస్ బతుకు మొత్తం ఓ మాయలో పడిపోయింది ప్రముఖ ఆస్ట్రాలజీర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: May 11, 2023, 5:00 pm
Advertisement

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అందరికీ సుపరిచితుడే. తెలుగు సినిమా రంగానికి ఇంకా రాజకీయ రంగానికి సంబంధించి ఈయన చెప్పిన అనేక విషయాలు నిజమయ్యాయి. ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో వేణు స్వామి చెప్పిన ఫలితాలు వెలువడటం అందరికి షాక్ కి గురి చేయడం జరిగింది. చాలామంది సెలబ్రిటీలకు వేణు స్వామి.. గురువుగా ఉంటూ ప్రత్యేకమైన పూజలు చేసి వారి జీవితాలలో దోషాలు తొలగిస్తూ రాణిస్తూ ఉంటారు.

Advertisement

ముఖ్యంగా హీరోయిన్ రష్మిక మందనాకి ప్రత్యేకమైన పూజలు చేసే ఆమె అతి తక్కువ కాలంలోనే జాతీయ హీరోయిన్ గా మారటంలో ఈయన హస్తం కూడా ఉన్నట్లు టాక్. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ జాతకం గురించి వేణు స్వామి అనేకమార్లు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ జాతకంలో నాలుగు గ్రహాలు ఒకేచోట ఉండటంతో… ఒకేసారి రాజయోగంతో పాటు.. ఉన్న రాజయోగాన్ని అనుభవించకుండా ఆగ్రహాలే అడ్డుకుంటున్నాయని ఇది కోటి మందిలో ఒకరికే వచ్చే జాతకం అని కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

prabhas salar rights more than other movies

రాబోయే రోజుల్లో అనారోగ్య పరంగా ఇంకా వివాహపరంగా ప్రభాస్ అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చారు. మంచి పేరు ఎలా వస్తదో అదే రీతిలో ఇబ్బందులు కూడా తలెత్తుతాయని వేణు స్వామి స్పష్టం చేశారు. గురు, శని చండాల యోగంతో ఉండటంతోనే ప్రభాస్ ఇటువంటి పరిస్థితులు ఎదురుకోబోతున్నాడు అని వేణు స్వామి జాతకం తెలియజేశారు. దీంతో ప్రభాస్ బతుకు మొత్తం ఓ మాయలో పడిపోతుందని చెప్పుకొచ్చారు. వేణు స్వామి తాజాగా ప్రభాస్ గురించి చెప్పిన జాతకం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి