Bigg Boss OTT Telugu : భారీ అంచనాల నడుమ ప్రారంభం అయిన తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వర్షన్ కు మంచి స్పందన వచ్చింది. మొదట్లో లైవ్ స్ట్రీమింగ్ అంటూ ప్రచారం చేశారు. దాన్ని జనాలు పట్టించుకోవడం లేదు. పైగా లైవ్ స్ట్రీమింగ్ వల్ల ప్రయోజనం శూన్యం అంటూ వెళ్లడి అయ్యింది. అందుకే మద్య లో ఆపేశారు. మళ్లీ మొదలు పెట్టినా కూడా జెన్యూన్ గా లైవ్ ఇవ్వడం లేదు. ఇక ఆ విషయం పక్కన పెడితే షో ముగింప దశకు వచ్చింది. ప్రస్తుం షో లో ఉన్న వారి పారితోషికాల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ఉన్న వారిలో అత్యధికంగా పారితోషికంను అఖిల్, బిందు మాధవి, అరియానా మరియు అషు రెడ్డిలు తీసుకుంటూ ఉన్నారు. బాబా మాస్టర్ మరియు నటరాజ్ మాస్టర్ లు ఒక మోస్తరు పారితోషికంను అందుకుంటూ ఉన్నారు. ఇక మిత్ర పారితోషికమే తీసుకోవడం లేదు అనే ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఆమె కు ఒక్క వారం కు 1.25 లక్షలు ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అసలు విషయం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది. ఇక యాంకర్ శివ మరియు అనీల్ ల పారితోషికం చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది.
శివ ఇస్తున్న ఎంటర్ టైన్మెంట్ నేపథ్యంలో ముందుగా అనుకున్న పారితోషికం కంటే కాస్త ఎక్కువ ఇస్తున్నారని తెలుస్తోంది. ఇక అనీల్ కు అందరి కంటే తక్కువగా వారంకు లక్ష రూపాయల పారితోషికం మాత్రమే ఇస్తున్నారట. అయినా అనీల్ ఇన్ని వారాలు ఉంటాడని ఏ ఒక్కరు భావించలేదు. తన కూల్ అండ్ కామ్ గోయింగ్ పర్శనాలిటీతో ఇన్నాళ్లు నెట్టుకు వచ్చాడు. తక్కువ పారితోషికం అయినా ఇన్నాళ్లు షో లో ఉండటం వల్ల మంచి లాభమే అనీల్ కు దక్కింది. మోడల్ అయిన అనీల్ కు బిగ్ బాస్ ఫేమ్ తప్పకుండా ఉపయోగపడుతుందనే టాక్ వినిపిస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.