Home » Entertainment » Victory Venkatesh Gives Clarity About His Son Tollywood Entry
Entertainment

Venkatesh : పవన్ కళ్యాణ్ కొడుకు నా కొడుకు ఒకేసారి హీరోగా ఎంట్రీ ఇస్తారు ‘ – విక్టరీ వెంకటేష్..!!

Authored By
Anusha V
The Telugu News | Published on: January 3, 2024, 6:00 pm
Advertisement

Venkatesh : విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా ‘ సైంధవ్ సినిమా ‘ తెరకెక్కింది. హిట్ 2 ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా రుహాని శర్మ, శ్రద్ధ శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతుంది. దీంతో సినిమా యూనిట్ ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టింది. ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ మునిపెన్నడూ నటించని జోనర్ సినిమా ఇది. దీంతో సైంధవ్ సినిమా ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను పెంచేసింది.

Advertisement

యాక్షన్ ఎమోషన్ పాత్రలో వెంకటేష్ అదరగొట్టేశారు. ముద్దుల కూతురికి అంతుచిక్కని ఆరోగ్య సమస్య వస్తే తండ్రి ఎంత ఆవేదన చెందుతాడు. దాని వెనుక కుట్ర ఉంటే ఎంత వైలెంట్ గా రియాక్ట్ అవుతాడో ట్రైలర్ లో చూపించారు. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మీడియా ప్రతినిధులు వెంకటేష్ ను పలు ప్రశ్నలు అడిగారు. తన కుమారుడు అర్జున్ దగ్గుబాటి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని విక్టరీని ప్రశ్నించారు. దీనికి వెంకీ ఇచ్చిన సమాధానం చాలా ఫన్నీగా ఉంది. వాడు ఎక్కడో చదువుకుంటున్నాడమ్మా అని అన్నారు. ఫాన్స్ బలవంతం చేస్తున్నారు అని మీడియా ప్రతినిధి అంటే నేను వాళ్లకు చెబుతాను అని వెంకీ అన్నారు.

ముందు అందరూ బాగా చదువుకోవాలి. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అని వెంకీ అన్నారు. అర్జున్ ఎంట్రీ గురించి వెంకటేష్ ఎలాంటి హింట్ ఇవ్వలేదు. చదువు పూర్తయ్యాకే అన్నట్లుగా సమాధానం ఇచ్చారు. గతంలో గోపాల గోపాల సినిమా ఆడియో లాంచ్ లో వెంకటేష్ మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. మా అబ్బాయి ఎంట్రీ ఇచ్చే వరకు తాను నటిస్తానని వెంకటేష్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో వెంకటేష్ కొడుకు ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని ఫ్యాన్స్ అంత ఆసక్తిగా ఎదురు ఎదురుచూస్తున్నారు.

Anusha V

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి