Home » Entertainment » Vijay Devarakonda Fans Torture Will Anasuya
Entertainment

Anasuya : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ టార్చర్.. అనసూయ చేసిన తప్పును ఇప్పటికైనా ఒప్పుకుంటుందా..?

Authored By
mallesh
The Telugu News | Updated on: August 28, 2022 10:49 pm
Advertisement

Anasuya : యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ మొత్తానికి తను చేసిన తప్పుకు రియలైజ్ అవుతున్నట్టు తెలుస్తోంది. విజయ్ ఫ్యాన్స్ ఇష్టానుసారంగా మాట్లాడుతుండటంతో అసలు ఎందుకు పోస్టు పెట్టానా.. అని ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఆమె బాధతో చేస్తున్న ట్వీట్స్ దానికి అద్దం పడుతున్నాయి. ఓ రకంగా చూస్తే అనసూయ అలా పోస్టు పెట్టి ఉండకపోతే అనసూయ ఆంటీ అనే పదం ట్విట్టర్ ట్రెండింగ్‌లో నిలిచేది కాదంటున్నారు కొందరు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు.

Advertisement

Anasuya : రెచ్చగొట్టి తిట్టించుకోవడం ఎందుకు..

ఈ నెల 25న లైగర్ మూవీ విడుదలైన క్రమంలో అనసూయ విజయ్ దేవరకొండపై కామెంట్స్ చేసి ఉండకపోతే ఇక్కడిదాకా వచ్చేది కాదంటున్నారు కొందరు. ఏదేమైనా విజయ్‌, అనసూయ మధ్య గొడవ జరిగి ఉండవచ్చు. కానీ గతం గతహా అని వదిలేయకుండా అనసూయ కావాలనే పాత పంచాయితీని తీసి రెచ్చగొట్టడం సరికాదని అనేవాళ్లు చాలా ఉన్నారు. అనసూయ కూడా ఇండస్ట్రీలోనే కొనసాగుతోంది. భారీ బడ్జెట్ పెట్టి తీసిన సరిగా ఆడకపోతే దానిని నమ్ముకున్న దర్శక నిర్మాతలు, హీరోహీరోయిన్, తోటి క్యారెక్టర్ ఆర్టిస్టు ఎంత బాధపడుతారో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విజయవంతం అవుతే చాలా మందికి మంచి ఆఫర్లు వచ్చి ఉండేవి. విజయ్ పాన్ ఇండియన్ స్టార్‌గా అవరించేవాడు.

Vijay Devarakonda fans torture will Anasuya

Advertisement

దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మరో పాన్ ఇండియన్ స్టార్ ఎదిగాడని అంతా గర్వించేవారు.  బాలీవుడ్‌లో మరోసారి తెలుగు, టాలీవుడ్ జెండా ఎగిరేది. ఇదంతా మర్చిపోయి అనసూయ పిల్లల వలే లోకజ్ఞానం మరిచి బిహేవ్ చేసిందని అంతా పైర్ అవుతున్నారు. సినిమాను ఒక ఎంటర్మైన్ మెంట్‌గానే చూడాలి. అంతేకానీ అందులోని డైలాగ్స్ తమ మనోభావాలను దెబ్బతీస్తే అలా మాట్లాడకుండా ఉండి ఉంటే బాగుండేది అని మర్యాదపూర్వకంగా చెబతే అందరూ ఒకసారి ఆలోచిస్తారు కదా.. అది ఆలోచించకుండా గతంలో చేసిన తప్పుకు ఇప్పుడు ప్రతిఫలం అనుభించాడు. కర్మ ఫలం ఎప్పటికైనా వెంటాడుతుందని రెచ్చగొట్టడం ఎంటని అందరూ అనసూయను తప్పుబడుతున్నారు. మొత్తానికి మొదట కామెంట్ పెట్టి అనసూయ తప్పు చేసిందని అదే లేకపోతే ఇలా ట్రోలింగ్‌కు గురి అయ్యేది కాదుగా అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి