Home » Entertainment » Vijay Devarakonda Shares Cute Pic Of Samantha
Entertainment

Vijay Devarakonda : త‌న ప‌క్క‌న స‌మంత ఫొటోని పెట్టి మార్ఫింగ్ చేసిన విజ‌య్ దేవ‌రకొండ‌

Authored By
Sam C
The Telugu News | Published on: April 22, 2022, 5:00 pm
Advertisement

Vijay Devarakonda : రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాల స్పీడ్ పెంచాడు. ఒక సినిమా పూర్తైందో లేదో వెంట‌నే మరో సినిమా మొద‌లు పెట్టేందుకు ఆస‌క్తి చూపుతున్నాడు. లైగర్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లో పూరీ జ‌గ‌న్నాథ్ తో క‌లిసి మ‌రో సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమాకి జ‌న‌గ‌ణ‌మన అనే టైటిల్ అనుకున్నారు. ఇక హీరో విజయ్‌ దేవరకొండ శివ నిర్వాణ డైరెక్షన్‌లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా సమంత నటించనుంది.

Advertisement

గురువారం హైదరాబాద్‌లో లాంచనంగా ప్రారంభమైంది. పూజా కార్య‌క్ర‌మాల్లో డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌తోపాటు హరీశ్ శంకర్, బుచ్చిబాబు, కొరటాల శివ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు కాని సమంత మాత్రం మిస్సయ్యింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ లాంచ్‌కు సామ్‌ ఎందుకు రాలేదు అన్న చర్చ మొదలైంది. అయితే స‌మంత లోటు తీర్చేందుకు విజ‌య్ దేవ‌ర‌కొండ వినూత్న ప్ర‌య‌త్నం చేశారు. స‌దరు పూజా కార్యక్రమానికి కి సమంత తో పాటు వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ హాజరైనట్లు మార్ఫింగ్ చేసిన ఫోటో విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.పూజా కార్యక్రమానికి సమంత, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ పాల్గొన్న ఒరిజినల్ ఫోటో ఇది.

vijay devarakonda shares cute pic of samantha

Advertisement

Vijay Devarakonda : విజ‌య్ ఆలోచ‌న‌…

కాబట్టి ఒరిజినల్ ఫోటో షేర్ చేయాలంటూ మీడియాను కోరారు. నిజానికి సమంతతో పాటు రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ ఈ ఈవెంట్ కి హాజరు కాలేదు. మరి విజయ్ దేవరకొండ వాళ్ళు హాజరైనట్లు ఉన్న మార్ఫింగ్ ఫోటో చేశారు విజ‌య్. దీనిపై భిన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. కాగా, స‌మంత ప్రస్తుతం దుబాయ్‌లో హాలీడే ట్రిప్‌లో ఉంది. ఈ కారణంగానే మూవీ లాంచ్‌ ఈవెంట్‌కు ఆమె రాలేదని సమాచారం. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో సమంత నటిస్తుండటం, రౌడీ హీరోతో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని అంచనాలు పెరిగాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి