Home » Entertainment » Vijay Devarakonda Took A Decision For Samantha
Entertainment

Samantha : సమంత సంతోషం కోసం సంచలన నిర్ణయం తీసుకున్న విజయ్ దేవరకొండ

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: October 25, 2022, 11:00 am
Advertisement

Samantha : విజయ్ దేవరకొండను అందరూ రౌడీ హీరో అని పిలుస్తుంటారు. తన మాట తీరును చూసి ఆయన ఆటిట్యూడ్ గురించి అందరూ మాట్లాడుతారు కానీ.. విజయ్ దేవరకొండ మనసు చాలా మంచిది అని చాలాసార్లు రుజువు అయింది. అయితే.. విజయ్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు. అందుకే అది కొందరికి నచ్చదు. దాన్ని పొగరు అని అంటారు. అంతే కాదు.. విజయ్ ని కావాలని ఇండస్ట్రీలో కొందరు టార్గెట్ చేశారు అనేది అక్షర సత్యం. అయినా కూడా విజయ్ తన పని తాను చేసుకొని వెళ్తాడు. ఎవ్వరి మాటా పట్టించుకోడు.

Advertisement

ప్రస్తుతం విజయ్ సినిమా కెరీర్ ఏం బాగోలేదు. లైగర్ మూవీ అట్టర్ ప్లాఫ్ అయ్యాక విజయ్ కెరీర్ కష్టాల్లో పడింది. అయినా కూడా తనకు సినిమా ఆఫర్లు రావడం మాత్రం తగ్గడం లేదు. వరుస ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరిగా ఇప్పటికీ వెలుగొందుతున్నాడు రౌడీ హీరో. అయితే.. విజయ్ దేవరకొండ దివాళీ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎందుకంటే.. విజయ్ దేవరకొండ, సమంత బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిందే. సమంతకు కూడా విజయ్ అంటే చాలా ఇష్టం. విజయ్ లాంటి హీరోలో ఇండస్ట్రీకి కావాలని సమంత ఓ షోలోనూ చెప్పుకొచ్చింది.

Vijay Devarakonda took a decision for Samantha

Advertisement

Samantha : విజయ్ దివాళీ సెలబ్రేషన్స్ ఎక్కడో తెలుసా?

తాజాగా విజయ్ దేవరకొండ తన దివాళీ సెలబ్రేషన్స్ ను సమంత ఇంట్లో చేసుకోబోతున్నాడట. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే.. సమంత ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తోంది. విడాకులు తీసుకొని కూడా ఇప్పటికీ సంవత్సరం అయింది. విడాకులు తీసుకున్నా కూడా తన సినిమా కెరీర్ మాత్రం ఆగలేదు. ఈనేపథ్యంలో విజయ్ తన దీపావళి సెలబ్రేషన్స్ ను సమంతతో జరుపుకోబోతున్నాడట. తనను ఒంటరిగా ఉండలేక ఫారెన్ వెళ్దామని అనుకుందట. కానీ.. విజయ్ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడట. వెంటనే వాళ్ల అమ్మతో కలిసి స్పెషల్ పార్టీ అరేంజ్ చేశాడట. తనకు స్పెషల్ గా దివాళీ సెలబ్రేట్ చేస్తుండటంతో సమంత కూడా చాలా సంతోషం వ్యక్తం చేసిందట. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో సమంతకు ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికాడన్నమాట.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి