Vijay Deverakonda puri jaganandh 3rd film in socia fantasy genre
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఇప్పుడు లైగర్ సినిమాతో పాన్ ఇండియన్ స్థాయిలో అదరగొట్టేందుకు రెడీగా ఉన్నాడు. అయితే విజయ్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఓ సినిమా ఫలితం లేకుండానే.. ఆ దర్శకుడితోనే వరుసగా సినిమాలు చేస్తే వచ్చే ప్రమాదాన్ని అంచనా వేయలేం. అసలే పూరి జగన్నాథ్ ఫాం కోల్పోయి ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ ఏదో అలా ఆడేసింది. ఇక ఇప్పుడు లైగర్ అంటూ రాబోతోన్నాడు. ఇందులో కొత్తదనం ఏమీ కూడా కనిపించడం లేదు. అయితే ఈ సినిమా ఫలితం ఏంటో తెలియక ముందే మరో సినిమాను పట్టాలెక్కించేశారు. జన గణ మన అంటూ విజయ్‌తో పూరి జగన్నాథ్ మరో సినిమాను పట్టాలెక్కించేశాడు. లైగర్ తేడా కొడితే..
ఈ చిత్రం పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అయితే ఇది వరకే కొన్ని రూమర్లు వచ్చాయి. వీరి ప్రయాణం కేవలం రెండు సినిమాలతోనే ఆగదని, మరో చిత్రాన్ని కూడా సెట్ చేయబోతోన్నారని తెలుస్తోంది. దానికి సంబంధించిన చిన్న లైన్ ఇప్పుడు బయటకు వచ్చింది. విజయ్ కోసం.. పూరి ఇప్పుడు ఓ సోషియో ఫాంటసీ కథని తయారు చేశాడట. అది ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘యమదొంగ` జోనర్‌లో సాగుతుందని సమాచారం. పూరి ఇలాంటి కథ రాయడం ఇదే తొలిసారి అన్న సంగతి తెలిసిందే. ఇంత వరకు ఆయన కమర్షియల్ గ్యాంగ్ స్థర్ కథలను మాత్రమే డీల్ చేశాడు. విజయ్ దేవరకొండ కూడా ఇది వరకు ఈ జోనర్ ట్రై చేయలేదు. కేవలం లవర్ బాయ్, యాంగ్రీ యంగ్ మెన్‌గానే కనిపించేశాడు.
Vijay Deverakonda puri jaganandh 3rd film in socia fantasy genre
సో.. వీరిద్దరికీ ఇది కొత్త కథే! అందుకే ఈ ప్రాజెక్ట్‌ను కూడా ఓకే చేసినట్టు తెలుస్తోంది. అసలే పూరి దగ్గర కథలకు లోటు ఉండదన్న సంగతి తెలిసిందే. ఆయన దగ్గర బౌండెడ్ స్క్రిప్టులు 50 వరకూ ఉన్నాయని టాక్. అందులో… ఇదొకటి. ‘లైగర్’ జరుగుతున్నప్పుడు ‘జనగణమన’ కథ చెప్పి విజయ్ దేవరకొండని ఇంప్రెస్ చేశాడు పూరి. ఇప్పుడు ‘జనగణమన’ చేస్తున్నప్పుడే ఈ సోషియో ఫాంటసీ కథ చెప్పి మరోసారి ఓకే చేయించుకొన్నాడట. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకక్కించనున్నారని తెలుస్తోంది. మొత్తానికి పూరి వలలో విజయ్ చిక్కినట్టు అనిపిస్తోంది. ఈ సినిమాల్లో ఏదైనా ఒక్కటి హిట్ అయినా పర్లేదు. కానీ లైగర్ తేడా కొడితే లెక్కలు మారే చాన్స్ ఉంది.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.