
Ranabali Movie : భర్త విజయ్ దేవరకొండ మీద ఎంత ప్రేమ తల్లీ నీకు..!
Ranabali Movie : విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘రణబాలి’ ఒకటి. ఈ సినిమాను ముందుగా అనుకున్న ప్రకారం పూర్తి చేసి ఉంటే సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాల్సి ఉంది. అయితే షూటింగ్, ఇతర నిర్మాణ పనుల్లో కొంత ఆలస్యం ఏర్పడటంతో ఆ రిలీజ్ డేట్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో సెప్టెంబర్ 11న విజయ్ దేవరకొండ సినిమా కాకుండా ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇక ‘రణబాలి’ కొత్త విడుదల తేదీ ఎప్పుడు ఉంటుందా? అని విజయ్ అభిమానులు చాలాకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి సమాధానం దొరికినట్టేననే టాక్ ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అక్టోబర్ 30న ‘రణబాలి’ని వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Ranabali Movie : భర్త విజయ్ దేవరకొండ మీద ఎంత ప్రేమ తల్లీ నీకు..!
‘రణబాలి’లో హీరోయిన్‌గా నటిస్తున్న రష్మిక మందన్నకు ఇటీవల షూటింగ్ సమయంలో గాయమైన సంగతి తెలిసిందే. ‘మైసా’ సినిమా షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తుండగా ఆమె తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వైద్యులు ఆమెకు దాదాపు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.అయితే ‘రణబాలి’లో రష్మికకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ఇప్పటికే చాలావరకు పూర్తయినట్లు సమాచారం. ఇంకా ఏమైనా బ్యాలెన్స్ సీన్లు ఉంటే, ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత వాటిని పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తన భార్య కమ్ హీరోయిన్ రష్మిక విషయంలో విజయ్ దేవరకొండ ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.మరోవైపు రష్మిక కూడా గాయం కారణంగా ఎక్కువ కాలం షూటింగ్‌కు దూరంగా ఉండకూడదనే ఉద్దేశంతో, ఆరోగ్యం సహకరించిన వెంటనే వీలైనంత త్వరగా తిరిగి షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఆమె పూర్తి ఆరోగ్యంతో కోలుకోవడానికే చిత్రబృందం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.‘రణబాలి’ కొత్త రిలీజ్ డేట్‌గా అక్టోబర్ 30ను ఖరారు చేస్తే సినిమాకు అనుకూలంగా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే అక్టోబర్ మొదటి రెండు మూడు వారాల్లో ఇప్పటికే పలు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
వెంకటేష్ నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’, ఏకే 47, రజనీకాంత్ ‘జైలర్ 2’, ధనుష్ నటిస్తున్న ‘ఓం’ వంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు క్యూ కడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు దసరా కానుకగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ కూడా అక్టోబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా అక్టోబర్ 16ను పరిశీలిస్తున్నారనే టాక్ కూడా ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో భారీ సినిమాలతో నేరుగా క్లాష్ కాకుండా ‘రణబాలి’ని అక్టోబర్ 30న సోలో రిలీజ్ చేయడం బడ్జెట్ పరంగా కూడా సేఫ్ ఆప్షన్ అవుతుందని భావిస్తున్నారు. అయితే చివరి నిర్ణయం మాత్రం చిత్రబృందం తీసుకోవాల్సి ఉంది.
‘రణబాలి’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.రాయలసీమ నేపథ్యంగా సాగే ఈ కథలో స్వాతంత్ర్యం రాకముందు జరిగిన పోరాటంలో ఒక వీరుడు చేసిన యుద్ధాన్ని ప్రధానంగా చూపించనున్నట్లు సమాచారం. అయితే ఇది సాధారణంగా మనం చూసే ఫ్రీడమ్ ఫైట్ కథల తరహాలో ఉండదని తెలుస్తోంది. ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని ఇచ్చేలా ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని దర్శకుడు ఆవిష్కరించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.
విజయ్ దేవరకొండ కెరీర్‌లో ‘రణబాలి’ భారీ స్థాయిలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఇప్పటికే ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.ఇద్దరి కాంబినేషన్‌కు ఇప్పటికే ఉన్న క్రేజ్‌కు తోడు.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్, పీరియాడిక్ యాక్షన్ కథ, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వంటి అంశాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఇప్పుడు అక్టోబర్ 30 రిలీజ్ డేట్ నిజంగానే లాక్ అవుతుందా? లేదా మరో తేదీకి మారుతుందా? అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Vijayasai Reddy Vs Subba Reddy వైసీపీ మాజీ ఎంపీ, మాజీ ముఖ్య నేత వి. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా…
Hanuman Nagar Colony : ఉప్పల్‌లోని హనుమాన్ నగర్ కాలనీలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి, ఉత్సాహం, ఐక్యత…
Vizag : విశాఖ బీచ్ అంటేనే ఆహ్లాదం, అందం, ఆహ్లాదకరమైన సముద్ర గాలి గుర్తుకొస్తాయి. నీలిరంగు కెరటాలను చూస్తూ గంటల…
Ys Jagan : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పర్యటన విషయంలో ఎదురుచూపులు తప్పడం…
Women's : ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం మరో కీలక అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇక ఉద్యోగం లేదా సాధారణ…
Peanuts : వేరుశనగను చాలామంది సాధారణ స్నాక్‌గా చూస్తారు. కానీ ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్-E, మెగ్నీషియం,…
Pawan Kalyan : స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరో రెండు నెలల్లో…
Chiranjeevi Vs Rajinikanth : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇద్దరూ ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగడం…
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అలిగారా? సీఎం చంద్రబాబు నాయుడితో పాటు రాష్ట్ర…
Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి శాసనమండలి సమావేశాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న…
Vishwanath And Sons Movie Review : కుటుంబ కథలు, భావోద్వేగాలు, ప్రేమ, వినోదం కలగలిసిన సినిమాలు ప్రేక్షకులకు ఎప్పుడూ…
Karthika Deepam 2 Today Episode August 14th : కార్తీక దీపం 2 ఆగస్టు 14 ఎపిసోడ్ 749:…
This website uses cookies.