
#image_title
Vishal – Dhansika | తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు చాలా ఉన్నాయి. అజిత్-శాలిని, సూర్య-జ్యోతిక, నయనతార-విగ్నేష్ శివన్ వంటి వారు సినిమాల ద్వారా పరిచయమై, ప్రేమలో పడినవారు. కానీ తాజాగా పెళ్లి చేసుకోబోతున్న విశాల్ మరియు సాయి ధన్సిక మాత్రం అలాంటి జంట కాదంటున్నారు సినీ వర్గాలు. వీరిద్దరూ ఒక్క సినిమాలోనూ కలిసి నటించకపోయినా, మనసులు మాత్రం కలిశాయి. తాజాగా వీరి ఎంగేజ్మెంట్ పూర్తవ్వడంతో, వీరి రిలేషన్ అధికారికంగా వెలుగులోకి వచ్చింది.
#image_title
వీరిమధ్య ప్రేమకు బీజం పడింది 2017లో జరిగిన ఓ వివాదంతో. ‘విజితిరు’ సినిమాకు సంబంధించిన ఓ ప్రెస్‌మీట్‌లో సాయి ధన్సిక స్టేజీపై మాట్లాడుతూ టీమ్ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలుపగా, అప్పట్లో ఆ చిత్రంలో నటించిన టీ. రాజేందర్ పేరును అనుకోకుండా మరిచింది. దీంతో రాజేందర్ తీవ్రంగా స్పందించి ఆమెపై విమర్శలు గుప్పించాడు. “సీనియర్లను గౌరవించడం తెలియదా?” అంటూ బహిరంగంగా ఆమెను హేళన చేశాడు.
ధన్సిక తన తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పినా, రాజేందర్ సాఫ్ట్‌గా తీసుకోలేదు. ఆమెపై “రజనీ సినిమాలో నటించిన తర్వాత గర్వం పెరిగింది” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘటన తర్వాత ఆమెకి సపోర్ట్‌గా ఉన్నాడు విశాల్. అప్పుడు తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న విశాల్, రాజేందర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాడు. “తనకంటే చిన్నవాళ్లను ప్రోత్సహించకుండా, బహిరంగంగా తిట్టడం సరైంది కాదు” అంటూ ధన్సికకు మద్దతుగా నిలిచాడు. అప్పటికే వారిద్దరి మధ్య కొంత పరిచయం ఉన్నప్పటికీ, ఈ సంఘటన తర్వాత వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం బలపడింది. అదే ప్రేమగా మారింది.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.