Home » Entertainment » Vishnu Priya Wants To Act With Akkineni Akhil
Entertainment

Akkineni Akhil : అఖిల్‌తో ఒక్క‌సారైన‌.. ఈ యాంక‌రమ్మ అలా అనేసింది ఏంటి?

Authored By
Sam C
The Telugu News | Published on: September 19, 2022, 3:30 pm
Advertisement

Akkineni Akhil : అక్కినేని మూడో త‌రం వార‌సుడు అఖిల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్ర‌తి సినిమాకి చాలా క‌ష్ట‌ప‌డుతూ సినిమాలు చేస్తున్న అఖిల్ మంచి హిట్ మాత్రం అందుకోలేక‌పోతున్నాడు. . ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నాడు అఖిల్. ఇప్పుడు అదే ఉత్సాహంతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఏజెంట్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఏజెంట్ చిత్రం కోసం తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశాడు. సిక్స్‌ ప్యాక్‌ బాడీతో హాలీవుడ్‌ హీరోలను తలదన్నేలా మారిపోయాడు.

Advertisement

Akkineni Akhil : ఒక్క ఛాన్స్ ప్లీజ్..

అఖిల్‌ ఏజెంట్‌ లుక్‌ చూస్తే ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో అర్థమవుతోంది. గ‌త కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గా, మూవీ ఎప్పుడు విడుద‌ల‌వుతుందో ఎవ‌రికి క్లారిటీ లేదు. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు టాక్ వినిపిస్తోంది. . ముందుగా అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయడానికి కుదరకపోవడంతో గట్టిపోటీ ఉన్నప్పటికీ దసరాను ఎంచుకున్నారట చిత్రయూనిట్. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాలో కీలకమైన పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నాడు. హిపాప్ తమిజా ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

Vishnu Priya wants to act with Akkineni Akhil

Advertisement

అయితే నాగార్జున మాదిరిగా అఖిల్‌కి అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం అఖిల్‌ని చాలా ఇష్ట‌ప‌డుతుంటారు. ఇక రీసెంట్‌గా విష్ణు ప్రియ‌..అఖిల్ గురించి మాట్లాడుతూ.. అఖిల్ తో ఒక్క ఛాన్స్ కావాలంటూ డైరెక్ట‌ర్ ల‌ను రిక్వెస్ట్ చేస్తోంది. త‌న‌కు అఖిల్ తో జ‌న్మ‌జ‌న్మ‌ల అనుబంధం ఉంద‌ని చెప్పింది. అఖిల్ తో డ్యాన్స్ చేసే ఒక్క అవ‌కాశం ఇప్పించాలంటూ చేతులు జోడించి మరీ వేడుకుంది. తాను అఖిల్ కు వీరాభిమాని అని చెబుతుంది. అంతే కాకుండా అఖిల్ సినిమాలు వ‌చ్చినా కూడా బ‌ర్త్ డే వ‌చ్చినా అత‌డి ఫోటోల‌ను షేర్ చేస్తూ ల‌వ్ చూపిస్తుంది. ఇక విష్ణు ప్రియ అంత‌లా వేడుకుంటుంది అంటే అఖిల్‌తో ఏదో ఒక డైరెక్ట‌ర్ సినిమా అవ‌కాశం త‌ప్ప‌క ఇస్తాడ‌ని అనుకుంటున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి