
Vishwak sen : సరి కొత్తగా విశ్వక్ సెన్ "గామి" ప్రెస్ మీట్... 200 కోట్లు పక్కా..!
Vishwak sen : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫలక్ నామా దాస్ అనే సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు విశ్వక్ సేన్..అప్పటినుండి ఇప్పటివరకు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ నేపద్యంలోనే తాజాగా విశ్వక్ సెన్ “గామి” అనే సినిమాలో నటించడం జరిగింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ కాగా ఇటీవల దీనికి సంబంధించి ప్రెస్ మీట్ ను నిర్వహించారు. అయితే విశ్వక్ సెన్ “గామి” మూవీ ప్రెస్ మీట్ చాలా కొత్తగా నిర్వహించారు. ఈ సినిమాను ఎక్కువ శాతం మంచులో షూటింగ్ చేయడం వలన సినిమా ప్రెస్ మీట్ ను అదే తరహాలో ప్లాన్ చేశారు మూవీ టీమ్. ఈ నేపథ్యంలోనే పూర్తిగా మంచుతో కూడుకున్న సెటప్ ను క్రియేట్ చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు. దీంతో విలేకరులు సైతం చలిలో గజగజ వణుకుతూ మూవీకి సంబంధించిన ప్రశ్నలు అడిగారు.
దీనిలో భాగంగా విశ్వక్ సెన్ మాట్లాడుతూ రిపోర్టర్స్ అడిగిన పలు రకాల ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఓ విలేకరి మీ సక్సెస్ మీట్ అప్పుడు పెద్దలు కూడా మా సినిమాలకు వచ్చి మాట్లాడితే బాగుంటుందని అన్నారు కదా. మీకు ఎన్టీఆర్ కూడా చాలా క్లోజ్. అలాంటప్పుడు వారిని తీసుకువచ్చి ప్రమోషన్స్ చేయవచ్చు కదా అలా కాకుండా ఇలాంటి మాట ఎందుకు వాడారని అడిగాడు. అయితే దీనికి విశ్వక్ సెన్ సమాధానం ఇస్తూ నేను పెద్దోళ్ళు అన్నది సినిమా వాళ్ళ గురించి కాదని మూవీ రివ్యూ రైటర్స్ అందరూ కూడా యంగ్ స్టర్స్ ఉన్నారు కొంతమంది ముసలోళ్ళు కూడా ఉంటే బాగుండేదని చెప్పాను. మీరు పెద్దోళ్ళ అంటే అలా అనుకున్నారా. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు అంటూ సమాధానం ఇచ్చారు. నేను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫలక్ నామా దాస్ కూడా రాలేదు. నేను ఆ టైంలోనే ఈ సినిమా చేద్దామని డిసైడ్ అయ్యా. ఈ సినిమా ఎక్కువ ఆ సినిమా తక్కువ అనేది ఏమీ లేదు.
Vishwak sen : సరి కొత్తగా విశ్వక్ సెన్ “గామి” ప్రెస్ మీట్… 200 కోట్లు పక్కా..!
ఇక ఈ సినిమాలో చూస్తే గనుక ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదు. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అంటే డాన్స్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు ఐటమ్ సాంగ్ కావచ్చు లేదా ఫైట్స్ కావచ్చు ఇవేమీ లేకుండా నేను ఈ సినిమా చేయడం అనేది చాలా పెద్ద విషయం అది మీకు కూడా తెలుసు. కానీ ఈ సినిమా ఓపెనింగ్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం నిజంగా నా అదృష్టం అంటూ ఈ సందర్భంగా విశ్వక్ తెలియజేశారు.అలాగే మూవీకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను విశ్వక్ ప్రెస్ మీట్ లో విలేకరులతో పంచుకున్నారు.అయితే విశ్వక్ మునుపెన్నడు లేని విధంగా అఘోర పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.