Niharika : మా ఆయన ఫెయిల్యూర్ హీరో కాదు.. నిహారిక ఫ్రెండ్ భర్తని భలే వెనకేసుకొచ్చింది..!
Niharika : మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక క్లోజ్ ఫ్రెండ్స్‌లో వితికా ఒకరు. నిహారికతో ఈ మధ్య వితికా ఎక్కువగా చక్కర్లు కొడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. వితికా ఒకప్పుడు నటిగా అలరించింది. వరుణ్ సందేశ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరు బిగ్ బాస్ లోకి వెళ్లి సందడి చేయడం కూడా మనం చూశాం. అయితే వితికా భర్త చాలా రోజుల తర్వాత నింద అనే థ్రిల్లర్ సినిమాతో అలరించబోతున్నాడు. హ్యాపీడేస్, కొత్తబంగారు లోకం, కుర్రాడు.. ఇలా ఒకప్పుడు వరుస హిట్స్ కొట్టిన వరుణ్ సందేశ్ ఆ తర్వాత పరాజయాలు, సినిమాలకు కొంచెం గ్యాప్, బిగ్ బాస్.. ఇవన్నిటి తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు.
ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ జగన్నాథం నిర్మాతగా, దర్శకుడిగా ఈ నింద సినిమా తెరకెక్కిస్తున్నారు. నింద సినిమా జూన్ 21న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నిఖిల్ గెస్ట్ గా వచ్చాడు. ఈ ఈవెంట్ కి వరుణ్ సందేశ్ భార్య, నటి వితిక షేరు కూడా వచ్చింది. అయితే వరుణ్ సందేశ్ కెరీర్ లో ఎక్కువ ఫ్లాప్ సినిమాలే చూసాడు, మధ్యలో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఇటీవల నింద ప్రమోషన్స్ లో వరుణ్ కి దీనిపైనే ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నింద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వితిక షేరు దీనిపై స్పందించింది.
Niharika : మా ఆయన ఫెయిల్యూర్ హీరో కాదు.. నిహారిక ఫ్రెండ్ భర్తని భలే వెనకేసుకొచ్చింది..!
వితిక షేరు మాట్లాడుతూ.. చాలా మంది ఇలా వరుణ్ ని ఫెయిల్యూర్ హీరో అంటున్నారు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 17 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంటూ సినిమాలు తీస్తూ ఉన్నాడని చెప్పుకొచ్చింది. ఇక్కడ ఫెయిల్ అయితే నాకు వద్దు అని అన్ని సర్దేసుకొని వెళ్లిపోయేవాళ్లే ఫెయిల్ అయినట్టు. ఫ్లాప్స్ రాగానే సినిమాలు వదిలేసి వెళ్లిపోయేవాళ్లు ఫెయిల్ యాక్టర్స్. మా ఆయన అలా వెళ్లిపోలేదు, మా ఆయన ఫెయిల్యూర్ యాక్టర్ కాదు అని చెప్తూ స్టేజిపై ఎమోషనల్ అయింది. దీంతో తన భర్తకి ఎంత బాగా సపోర్ట్ చేస్తుందో అని వితికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి వితిక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
GST 2.0 Effect Gold Price Reduce : కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ వ్యవస్థలో తీసుకొచ్చిన తాజా సంస్కరణలు విప్లవాత్మకమని…
Best Govt Jobs : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎప్పటి నుంచీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. స్థిరమైన జీతం, భద్రమైన…
Lokesh Delhi Tour : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ తాజాగా ఢిల్లీ పర్యటన…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మరోసారి రైతు సమస్యల పేరిట ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నెల 9వ తేదీన యూరియా…
Harish Rao met with KCR : BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో శనివారం…
I Phone 17 | టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్‌ను ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోంది. 'ఆ డ్రాపింగ్' (Awe…
e Aadhaar App | భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే, ఆధార్ కార్డులో చిన్న చిన్న…
TGSRTC | తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టాలని యోచిస్తుంది. తొలి దశలో…
This website uses cookies.