
Wanted PanduGod Movie song shooting video on youtube
Wanted PanduGod Movie : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలంటే ప్రత్యేక క్రేజ్ ఉంటుంది.అందం అభినయంతో కనిపించే హీరోయిన్స్.. పండ్లతో చేసే సరసాలు ఇవన్నీ కూడా ఆకట్టుకుంటాయి. ఒకప్పడు బ్లాక్ బస్టర్లు.. ఎన్నో సూర్ హిట్ చిత్రాలు.. ఆధ్యాత్మిక చిత్రాలు తీసిన రాఘవేంద్రరావు ప్రస్తుతం సినిమాలు తీయడం లేదు కానీ.. ఆయన పర్యవేక్షణలో ఈ మధ్యకాలంలో చాలనే సినిమాలు వస్తున్నాయి. ఇటీవల శ్రీకాంత్ తనయుడు రోషన్ బాబు హీరోగా పెల్లి సందడి సినిమాకు కూడా రాఘవేంద్రరావు పర్యవేక్షించారు. ప్రస్తుతం ఆయన సమర్పణలో సుడిగాలి సుధీర్ హీరోగా అనసూయ భరద్వాజ్, సునీల్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో వాంటెడ్ పండుగాడ్ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మిస్తున్నారు.
శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పిల్లి, యాంకర్ విష్ణుప్రియ కొంతమంది కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సినిమా ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల అబ్బా అబ్బా అబ్బబ్బ.. అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చూస్తే.. నలుగురు హీరోలకు నలుగురు హీరోయిన్లను జోడించి దర్శకేంద్రుడి స్టైల్ లో హీరోయిన్స్ అందాలను క్యాచీగా చూపించాడు దర్శకుడు. ఈ పాట చూస్తే ఖచ్చితంగా రాఘవేంద్రరావు మార్క్ సూపర్ హిట్ సాంగ్స్ అన్ని గుర్తుకు వస్తాయి.
Wanted PanduGod Movie song shooting video on youtube
రీసెంట్ గా విష్ణుప్రియ ఫస్ట్ లుక్ నాభి నడుమందాలను చూపిస్తూ తమలపాకులు నడుముపై ఉంచడం వంటివి చేసి ఆకట్టుకునేలా చేశారు దర్శకేంద్రుడు. అయితే ఈ రొమాంటిక్ సాంగ్ ను రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మేకింగ్ లో చూస్తే ఆయనే హీరోయిన్లకు దగ్గరుండి వారిపై వాటర్ స్ప్రే చేస్తుండటం విశేషం. ఇక ఈ పాటలో సుడిగాలి సుధీర్ జోడిగా దీపికా పిల్లి, వెన్నెల కిషోర్ కి జోడిగా విష్ణుప్రియ చేసిన డ్యాన్స్ హైలైట్ అవుతున్నాయి. సుధీర్ దీపికాలతో పాటు సప్తగిరి-నిత్యాశెట్టి, శ్రీనివాసరెడ్డి-వాసంతి, వెన్నెల కిషోర్-విష్ణుప్రియ జోడిలుగా కనిపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది. మీరు చూడకుంటే చూసేయండి మరి…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…
This website uses cookies.