
#image_title
Bigg Boss 7 Telugu : శోభా శెట్టి.. అదేనండి.. కార్తీక దీపం మోనిత. మనం కార్తీక దీపం సీరియల్ లోనే మోనిత ఇలా ఉంటుంది కావచ్చు. బయట మోనిత చాలా బాగా ఉంటుంది అని అంతా అనుకున్నాం. కానీ.. అసలు మోనిత క్యారెక్టరే శోభా శెట్టి నిజమైన క్యారెక్టర్ అని బిగ్ బాస్ హౌస్ లోకి శోభా శెట్టి వచ్చిన తర్వాత తెలుస్తోంది. ఎందుకంటే.. ప్రతి చిన్న విషయానికి అరవడం, యాక్టింగ్ మాకు కూడా వచ్చు.. మేము ఇక్కడికి ఆడటానికి వచ్చాం. బరాబర్ ఆడుతాం. ఎవరైనా నామినేట్ చేస్తే తీసుకోకపోవడం, ఇలా శోభా శెట్టి ప్రతి చిన్న విషయానికి కూడా రియాక్ట్ అవడం చూసి ప్రేక్షకులు మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు.
మోనిత క్యారెక్టరే నీ రియల్ క్యారెక్టర్ కన్నా బెటర్ అని బిగ్ బాస్ అభిమానులు అంటున్నారు. వయసులో ఎంతో పెద్ద.. చాలా కూల్ గా శివాజీ.. నువ్వు నన్ను నామినేట్ చేశావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అంటూ చెప్పినా కూడా ఆ నామినేషన్ ను పెద్ద రచ్చ చేసింది మోనిత. కారణం లేకుండా నామినేట్ చేయడం ఏంటి.. నాన్ సెన్స్ అంటూ రెచ్చిపోయింది. కూల్ గా ఉన్న శివాజీని రెచ్చగొట్టింది. మిగితా వాళ్ల రీజన్ ను తన రీజన్ గా చెప్పుకోవడం నాకు నచ్చలేదు.. నన్ను నామినేట్ చేశావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చాలా కూల్ గా చెబుతాడు శివాజీ.శివాజీ ముందు నామినేట్ చేసినప్పుడు పెద్దగా రెస్పాండ్ కాని శోభా ఆ తర్వాత బయటికి వచ్చాక కారణాలు లేకుండా కూడా కొందరు నామినేట్ చేస్తున్నారంటూ రెచ్చిపోయింది.
#image_title
అక్కడే శివాజీ ఉన్నాడు. నేను వాదించదలుచుకోలేదు అంటూ శివాజీ అంటాడు. కానీ.. ఏదైనా చెప్పాలంటే వాలిడ్ రీజన్ ఉండాలి అంటుంది. రీజన్ ఏంటి.. మొత్తం కలిసికట్టుగా ఆడుతున్నారు అంటాడు శివాజీ.ఎవరు ఆడుతున్నారు అంటే నేను మాట్లాడితే తట్టుకోలేవు అంటాడు శివాజీ. దీంతో నేను కూడా అంతే అన్న అంటుంది శివాజీ. నాకు కూడా వచ్చు మాట్లాడటం అంటుంది. దీంతో నువ్వు అక్కడ అనుకున్నట్టు ఇక్కడ ఉండదు అంటాడు శివాజీ. దీంతో ఏంటి బయట ఎక్కడ ఉంటుంది. పో అమ్మా. ఈ కంటెంట్ వర్కవుట్ అవదు అంటాడు. పో అమ్మా అంటే నడవదు. ఇది బిగ్ బాస్ హౌస్. ఆయన పొమ్మంటే నేను వెళ్తాను. ఇది నా నామినేషన్ అంటూ తెగ రెచ్చిపోయి మాట్లాడుతుంది. కొత్త కంటెంట్ ట్రై చేయి అంటే మీలా కాదు.. మీలా అయితే అస్సలు కాదు. మాకు అలా రాదు. మాట తెరిస్తే చాలు.. కంటెంట్ కంటెంట్ ఇచ్చుకోండి అంటుంది. ఒరిజినాలిటీలో నాకు ఎక్కువ మార్కులు కూడా వచ్చాయి అంటుంది శోభాశెట్టి. దీంతో మాకు కూడా వచ్చాయి అంటాడు శివాజీ. ఎలా కంటెంట్ ఇచ్చాను అంటూ ఊరికే అనడం కాదు. మొత్తానికి వీళ్ల డిస్కషన్ మాత్రం ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది.
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
This website uses cookies.