we don't want Sowmya Rao as Jabardasth comedy show anchor
Anchor Sowmya Rao ; జబర్దస్త్ ప్రారంభం అయ్యి 10 సంవత్సరాలు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ పది సంవత్సరాల్లో అనసూయ మరియు రష్మి గౌతమ్ మాత్రమే యాంకర్స్ గా వ్యవహరించారు. ఈ మధ్య అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకోవడంతో ఆమె స్థానం లో కన్నడ బ్యూటీ సౌమ్య రావు ని తీసుకు వచ్చారు. ఆమె యాంకరింగ్ కి మంచి మార్కులు పడుతున్నాయని అంతా భావించారు. కానీ ఒక వర్గం ప్రేక్షకులు ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు. వారే అనసూయ యొక్క అభిమానులు అంటూ ప్రచారం జరుగుతుంది. మళ్ళీ అనసూయను తీసుకు వచ్చే ఉద్దేశంతో సౌమ్య రావు
కి వ్యతిరేకంగా ఆమె అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారట. సోషల్ మీడియా లో వారు చేసే హడావుడికి పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. మాకు వద్దు ఈ సౌమ్య అంటూ జబర్దస్త్ ప్రేక్షకులుగా చెప్పుకుంటున్న వారు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మళ్ళీ అనసూయని తీసుకు రావాలి లేదంటే రష్మి గౌతమ్ అయినా కొనసాగాలి అంతే తప్పితే ఈ రావు మాకు వద్దు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ గతంలో ఒకసారి జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పి మళ్లీ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాగే జబర్దస్త్ కి మళ్ళీ అనసూయ రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
we don’t want Sowmya Rao as Jabardasth comedy show anchor
అందుకే సౌమ్య వెళ్లి పోవాలి అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న ఈ విషయం ఎక్కడికక్కడ రచ్చ చేస్తుంది. ఒక వైపు సౌమ్య రావు యొక్క యాంకరింగ్ ప్రతిభ పై కూడా విమర్శలు వస్తున్నాయి. పదే పదే అర్ధం పర్ధం లేని తెలుగు మాట్లాడుతూ ఎలాంటి పేస్ ఫీలింగ్ లేని ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుందని అందుకే ఆమెను తొలగించి అనసూయ లేదా కొత్త యాంకర్ ని తీసుకు రావాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి మల్లెమాల వారు ఏం చేస్తారనేది చూడాలి.
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
This website uses cookies.