Home » Entertainment » What Is Going On Between Anchor Shiva And Ashu Reddy In Bigg Boss Ott Telugu
Entertainment

Bigg Boss OTT Telugu : యాంకర్ శివ, అషూ రెడ్డి మధ్య ఏం జరుగుతోంది? బిగ్ బాస్ హౌస్ లో అందరి మధ్య ఇదే చర్చ

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: March 8, 2022, 4:30 pm
Advertisement

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ప్రారంభం అయి వారం దాటింది. ఇప్పటికే ఒక కంటెస్టెంట్ ను బయటికి పంపించేశాడు బిగ్ బాస్. వారియర్స్ టీమ్ నుంచి ముమైత్ ఖాన్ ను బయటికి పంపించారు. నిజానికి.. ముమైత్ ఖాన్ బయటికి వెళ్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అసలు ముమైత్ కు ఎక్కువ ఓట్లు వచ్చినా కావాలని బిగ్ బాస్.. తనను ఎలిమినేట్ చేశాడని అంటున్నారు. అసలు నిజం ఏంటో దేవుడికే తెలియాలి.

Advertisement

what is going on between anchor shiva and ashu reddy in bigg boss ott telugu

మరోవైపు బిగ్ బాస్ ఓటీటీకి ఇప్పటి వరకు ఏ బిగ్ బాస్ సీజన్ కు రాని వ్యూస్ వచ్చినట్టు హోస్ట్ నాగార్జున చెప్పారు. కానీ.. ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. టీవీలో ప్రసారం అయ్యే సీజన్లతో పోల్చితే ఈ సీజన్ చాలా బోర్ అంటున్నారు ప్రేక్షకులు.మిగితా సీజన్లలో చాలా మటుకు లవ్ ట్రాక్స్ ప్రేక్షకులను అలరించాయి. కానీ.. ఇక్కడ అలాంటి లవ్ ట్రాక్స్ ఇంకా వర్కవుట్స్ కాలేదు. ఇప్పటికే అరియానా, అజయ్ మధ్య ఏదో ఉందనుకున్నారు కానీ.. అది కూడా తుస్సు అయింది. మరోవైపు యాంకర్ శివ ముందు బిందును గోకాడు. కానీ.. బిందు డైరెక్ట్ గా చెప్పింది. దీంతో హమీదాను పట్టుకున్నాడు.ఆ తర్వాత అషు రెడ్డిని పట్టుకున్నాడు. అషురెడ్డి, శివ మధ్య మాత్రం ఏదో జరుగుతోంది. తన షర్ట్ ను అషు దాయడం.

Advertisement

Bigg Boss OTT Telugu : లవ్ ట్రాక్స్ కూడా పెద్దగా లేవు

. తర్వాత అషు రెడ్డి ఆ షర్ట్ ను తీసుకురావాలనడం.. దాని మీద ఏదో రాయడం అన్నీ జరిగిపోతున్నాయి.ఆ తర్వాత మళ్లీ ఆ షర్ట్ ను తీసుకొచ్చి రాసిన దాన్ని చెరిపేసింది అషు. అంటే.. ఇద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ వార్తలు పురివిప్పుతున్నాయి. మరి.. నిజంగానే ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలైందా? అందుకే.. ఈ వారం నామినేషన్ లో కూడా అషు రెడ్డి.. శివను నామినేట్ చేయలేదు.నిజానికి.. అషు.. యాంకర్ శివను నామినేట్ చేద్దామని అనుకున్నట్టుంది కానీ.. తనను కాకుండా వెళ్లి మిత్రా శర్మను నామినేట్ చేసింది. వీళ్లిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అని హౌస్ కూడా కోడై కూస్తోంది.. చూద్దాం మరి ఇద్దరి మధ్య ఏం జరగబోతుందో?

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి