Home » Entertainment » What Is Janaki Plan To Get Vennela Married With Dilip
Entertainment

Janaki Kalaganaledu : వెన్నెల, దిలీప్ పెళ్లి జరిపించడం కోసం జానకి ప్లాన్.. జ్ఞానాంబ‌ ఒప్పుకుంటుందా? రామా ఏంచేస్తాడు?

Authored By
Varun G
The Telugu News | Published on: February 13, 2022, 11:30 am
Advertisement

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇవాళ ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. జానకి కలగనలేదు సీరియల్ 14 ఫిబ్రవరి 2022, సోమవారం ఎపిసోడ్ 236 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పూజ పూర్తయ్యాక.. రామా, జానకి ఇద్దరూ కారులో బయలుదేరుతారు. ఒకచోట కారును ఆపి.. ఇప్పుడు చెప్పండి జానకి గారు అంటాడు రామా. ఏంటి అని అడుగుతుంది జానకి. అమ్మ వచ్చినప్పుడు చెప్పడం ఆపేశారు కదా.. ఆ విషయం అంటాడు రామా. నా ఐపీఎస్ కలను నేను వదిలేశాను. మీరు కూడా ఆ విషయాన్ని మరిచిపోండి అని అంటుంది జానకి. అయినా కూడా రమా వినడు. తనను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. దీంతో కారు దిగుతుంది జానకి. మరోవైపు చనిపోయేందుకు వెన్నెల, దిలీప్ పెద్ద గుట్ట ఎక్కుతారు.

Advertisement

what is janaki plan to get vennela married with dilip

చివరిసారిగా ఒకసారి జానకికి ఫోన్ చేస్తుంది వెన్నెల. సారీ వదిన. నావల్ల నువ్వు చాలా బాధపడ్డావు. ఎన్నో సమస్యలు ఎదుర్కున్నావు అని అంటుంది. అవన్నీ ఇప్పుడెందుకు అంటుంది జానకి. ఎందుకంటే.. ఇక నేను ఉండను వదిన అంటుంది వెన్నెల. దీంతో జానకి షాక్ అవుతుంది. ఏమైంది.. ఎందుకు అలా మాట్లాడుతన్నావు అంటుంది జానకి. ఇంతలో ఫోన్ తీసుకొని రామా మాట్లాడుతాడు. దీంతో తన ప్రేమ విషయం చెబుతుంది వెన్నెల. నువ్వు ఎక్కడున్నావో చెప్పు.. నేను వెంటనే వస్తాను.. అంటాడు రామా. కానీ.. వెన్నెల మాత్రం చావుకు దగ్గర్లో ఉన్నాను అన్నయ్య అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. మళ్లీ ఫోన్ చేస్తే కలవదు. దీంతో ఏం చేయాలో జానకి, రామాకు అర్థం కాదు.

Advertisement

తను ఫోన్ మాట్లాడేటప్పుడు శంఖం సౌండ్ వచ్చిందని.. అది ఎక్కడో శివాలయంలో అయి ఉండొచ్చు.. శివాలయం దగ్గర వెతుకుదాం అని చెప్పి రామా, జానకి ఇద్దరూ వెతకడం ప్రారంభిస్తారు. ఇంతలో కొండ మీది నుంచి దూకేందుకు వెన్నెల, దిలీప్ సిద్ధం అవుతారు.

ఇంతలో వెన్నెల, దిలీప్ ను వెతుక్కుంటూ కొండ మీదికి వెళ్లి వాళ్లను చావకుండా ఆపేస్తారు రామా, జానకి. మమ్మల్ని చావనీయండి.. ఎందుకు కాపాడారు అని అంటుంది వెన్నెల. అమ్మ నా పెళ్లికి ఒప్పుకోదు అని అంటుంది వెన్నెల. ఎందుకు బతకాలి.. అంటుంది వెన్నెల.

Advertisement

Janaki Kalaganaledu : ప్రేమంటే కలిసి బతకడం కానీ.. కలిసి చనిపోవడం కాదు.. అని వెన్నెలకు చెప్పిన జానకి

ప్రేమంటే కలిసి బతకడం కానీ.. కలిసి చచ్చిపోవడం కాదు అంటుంది జానకి. అలా చేస్తే అది నిజమైన ప్రేమ అనిపించుకోదు అంటుంది జానకి. నా ప్రేమను ఇంట్లో ఎవ్వరూ ఒప్పుకోరు. మా పెళ్లికి అంగీకరించరు. అటువంటప్పుడు బతికి ఏం లాభం వదిన అంటుంది వెన్నెల.

మరోవైపు వెన్నెల నిశ్చితార్థం కోసం రామచంద్రాపురం వెళ్తారు జ్ఞానాంబ‌, గోవిందరాజు. వెన్నెలకు నిశ్చితార్థం ఏర్పాటు చేస్తారు. రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అని చెబుతాడు పంతులు. దీంతో అందరూ సరే అంటారు. రెండు రోజుల్లో వెన్నెల నిశ్చితార్థం ఉందని.. జానకి, రామాకు కూడా తెలియదు.

అమ్మ చెప్పినట్టు ఖచ్చితంగా నిశ్చితార్థం చేయిస్తుంది. నాకు అప్పుడైనా చావే గతి అన్నయ్య అంటుంది వెన్నెల. దీంతో దయచేసి అటువంటి మాట అనొద్దు. నీ నోట్లో నుంచి అటువంటి మాట వస్తేనే నాకు ఎలాగో అవుతుంది అంటాడు రామా. అమ్మ నిర్ణయాన్ని ఎదురించలేం తెలుసు కదా వదిన అంటుంది వెన్నెల.

మాకు నీ ప్రాణాలే ముఖ్యం వెన్నెల అని అంటుంది జానకి. కానీ.. జ్ఞానాంబ‌ మాత్రం పెళ్లి వాళ్లతో మాకు ప్రాణాల కన్నా పరువే ముఖ్యం అంటుంది. నీ ప్రాణాలే మాకు ముఖ్యం వెన్నెల. అందుకోసం నేను ఏం చేయడానికైనా రెడీ అని అంటుంది జానకి. పరువు విషయంలో ప్రాణాలు పోయే పరిస్థితే వస్తే.. ప్రాణాలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం అని అంటుంది జ్ఞానాంబ‌. అమ్మతో మాట్లాడి నీకు దిలీప్ కు పెళ్లి చేసే బాధ్యత మాది.. అని రామా వెన్నెలకు భరోసా ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి