what is the reasons for dhanush and aishwarya Divorce
Dhanush Aishwarya: గత కొన్ని రోజులుగా తమిళ మీడియాలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ మరియు ధనుష్ లు విడి పోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కొన్ని నెలలుగా వీరిద్దరు ఎవరికి వారు అన్నట్లుగా ఉంటున్నారు. ఈ సమయంలో వారిద్దరి అభిమానులు పుకార్లను కొట్టి పారేస్తూ వచ్చారు. కాని అంతా షాక్ అయ్యేలా నిజంగానే వారిద్దరు విడి పోయిన విషయం తెల్సిందే. ధనుష్ ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ అనడంలో సందేహం లేదు. ఆయన నటుడిగా రజినీకాంత్ కు ఏమాత్రం తగ్గకుండా స్టార్ డమ్ ను దక్కించుకున్నాడు. హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న ధనుష్ సంపాదన చాలా నే ఉంది. ఇక ఐశ్వర్య వ్యాపారాలు మరియు సినిమాలతో ఆమె కూడా లైఫ్ లో చాలా బిజీగా ఉండి బాగానే సంపాదిస్తున్నారు. అయినా కూడా వీరిద్దరు ఎందుకు విడి పోయారు అనే ప్రశ్నకు తమిళ మీడియా కొన్ని సమాధానాలు ఇస్తుంది.
ఇద్దరు విడి పోవడంకు ప్రథాన కారణం ఈగోస్.. ఔను వీరిద్దరు కూడా ఎక్కువగా ఈగోకు పోయే విడి పోయారు అంటున్నారు. సెలబ్రెటీ కపుల్స్ ఎక్కువగా ఈగోల వల్లే విడి పోయిన దాఖలాలు ఉన్నాయి. కనుక వీరు ఇద్దరు విడి పోవడం కు కూడా కారణం ఖచ్చితంగా ఈగోస్ అయ్యి ఉంటాయి అనేది చాలా మంది తమిళ మీడియా వర్గాల వారు అంటున్నారు. రజినీకాంత్ కూతురును అనే ఉద్దేశ్యం ఆమెలో.. తాను ఓ స్టార్ హీరోను అనే ఉద్దేశ్యం అతడిలో బలంగా ఉండి ఉంటుంది. అందువల్ల చిన్న చిన్న గొడవల సమయంలో కూడా ఈగోలకు వెళ్లి వాటిని పెద్దవిగా చేసుకుని ఉంటారు. ఐశ్వర్య మరియు ధనుష్ ల మద్య ఇంకా పలు విషయాల్లో కూడా విభేదాలు వచ్చి ఉంటాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.
what is the reasons for dhanush and aishwarya Divorce
రజినీకాంత్ వంటి సూపర్ స్టార్ కుటుంబం లో ఇలాంటి ఒక పరిణామం జరగడం ప్రతి ఒక్కరు శ్రద్దగా చూస్తూ ఉంటారు. వారు రజినీకాంత్ ను ఎంతగానో ప్రేమిస్తూ.. ఆరాధిస్తూ ఉంటారు. అలాంటి వారు ఆ కుటుంబంలో విడాకుల ముచ్చట అధికారికంగా రావడం ప్రతి ఒక్కరికి బాధకరంగా ఉంటుంది. ఇది రజినీకాంత్ కు అవమానంగా కూడా వారు భావిస్తూ ఉంటారు. రజినీకాంత్ మరియు ధనుష్ ల మద్య అనుబంధం ఎలా ఉండేది అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తండ్రి రజినీకాంత్ కు ధనుష్ గౌరవం ఇవ్వక పోయేవాడని… తన తండ్రిని చిన్నచూపుతో చూడటం వల్ల కూడా ఐశ్వర్య చాలా రోజుల పాటు మానసిక ఆవేదన పడుతున్నట్లుగా కొందరు మీడియా వర్గాల వారు చెబుతున్నారు. ఇక వ్యాపార సంబంధిత విషయాలు.. మరియు ధనుష్ బయటి వ్యవహారాలు అన్ని కూడా కలిసి ఇద్దరు విడి పోవడానికి కారణం అయ్యి ఉంటుందని నెటిజన్స్ మరియు మీడియా వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది వారే చెప్పాలి.
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
This website uses cookies.