
what will happen to samrat and honey in intinti gruhalakshmi
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 19 సెప్టెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 741 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కన్ స్ట్రక్షన్ సైట్ దగ్గర తులసి, సామ్రాట్ కలిసి తిరగడం, కలిసి మాట్లాడటం చూసి నందు, లాస్యకు అస్సలు పడదు. ఆ తర్వాత నందుతో తులసి గురించి మాట్లాడుతాడు సామ్రాట్. అసలు ఇంత మంచి తులసిని ఎందుకు మిస్ చేసుకున్నారు. మీరు నష్టపోయారంటే.. ఒకరు లాభపడ్డట్టే కదా. తులసి గారు రేపు మనం ఓ ఫైల్ ఫైనలైజేషన్ కోసం వెళ్లాలి. నేనే మీ ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటా అంటాడు సామ్రాట్. దీంతో సరే అంటుంది తులసి. వాళ్ల సాన్నిహిత్యం చూసి నందుకు చాలా కోపం వస్తుంది. రాత్రి కాగానే.. బీరు తాగుతూ కారు డ్రైవ్ చేస్తూ వస్తాడు. ఒకచోట కారు ఆపి.. బీరు తాగుతూ ఉంటాడు. సామ్రాట్ చెప్పిన మాటలే గురొస్తుంటాయి నందుకు.
what will happen to samrat and honey in intinti gruhalakshmi
ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో సామ్రాట్, తులసి తన దగ్గరికి వచ్చి వాళ్ల ప్రేమ విషయం చెప్పినట్టు కల గంటాడు నందు. ఆ తర్వాత వస్తున్నా అంటూ కోపంతో నందు కారు వేసుకొని వెళ్తుంటాడు. ఇంతలో కారు మధ్యలో ఆగిపోతుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే మెకానిక్ సురేశ్ కు ఫోన్ చేస్తాడు. సురేశ్ వచ్చి ఏమైందో అని చూస్తాడు. కారు బాగు అవుతుంది. ఆ తర్వాత ఓకే అంటాడు. కానీ.. మీరు తాగి ఉన్నారు కదా.. ఎలా వెళ్తారు. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎలా అంటాడు సురేశ్. ఇంతలో నందుకు ఒక ఐడియా వస్తుంది. ఒక కారుకు బ్రేకులు తీయాలని అడుగుతాడు. దీంతో ఎవరి కారు అని అడుగుతాడు. దీంతో సామ్రాట్ కారు అంటాడు. దీంతో వామ్మో.. ఆయన జోలికి నేను పోను. నన్ను వదిలేయండి సార్ అని చెప్పి వెళ్లిపోతాడు సురేశ్.
దీంతో నువ్వు వెళ్లిపోతే పని ఆగిపోతుందా. ఎవరు అడ్డుపడతారో నేను చూస్తాను అని అనుకొని.. డైరెక్ట్ గా సామ్రాట్ ఇంటికి వస్తాడు. సామ్రాట్ ఇంటి ముందు ఉన్న కారు కింద బ్రేక్ వైర్లు తెంపి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు నందు. కట్ చేస్తే తెల్లవారుతుంది.
నందు రెడీ అయి కారు దగ్గరికి వెళ్లగానే ఇంతలో తులసి అక్కడికి వస్తుంది. దీంతో ఇద్దరూ కలిసి కారులో బయలుదేరుతారు. కొంత దూరం వెళ్లాక కారు బ్రేకులు పనిచేయవు. దీంతో ఏం చేయాలో అర్థం కాదు సామ్రాట్ కు. చివరకు వెళ్లి ఒక స్తంభానికి ఢీకొంటుంది కారు.
దీంతో తులసి అంటూ గట్టిగా అరుస్తాడు నందు. అప్పుడే నిద్ర లేస్తాడు. ఇంతలో లాస్య అక్కడికి వచ్చి ఏమైంది.. నువ్వు తులసి అని అరిచావు కదా అంటుంది. దీంతో లేదు.. నేను తులసి అని ఎందుకు పిలుస్తాను అంటాడు. అప్పుడే తన మత్తు వదులుతుంది.
కట్ చేస్తే హనీని తీసుకొని కారులో వెళ్తుంటాడు సామ్రాట్. అందరికంటే మనమే ముందుగా వెళ్లాలి. ఫాస్ట్ గా నాన్న అంటుంది హనీ. దీంతో అలాగే అని కారు స్పీడ్ పెంచుతాడు సామ్రాట్. మరోవైపు సామ్రాట్ గారు బయలు దేరి ఉంటారు. బ్రేకులు పనిచేయవు అని గుర్తుకు తెచ్చుకుంటాడు నందు.
స్పీడ్ గా కారును నడుపుతూ తర్వాత బ్రేక్ నొక్కడానికి ప్రయత్నిస్తాడు సామ్రాట్. దీంతో బ్రేక్ పడదు. దీంతో సామ్రాట్ కు ఏం చేయాలో అర్థం కాదు. ఏమైంది అని అడుగుతుంది హనీ. ఇంతలో ఎదురుగా ఒక కారు వస్తుంది. దాన్ని తప్పించబోగా కారు వెళ్లి ఒక చెట్టుకు ఢీకుంటుంది. దీంతో హనీ తలకు గాయం అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.