Home » Entertainment » Where Is Siri And Srihaan Son
Entertainment

Siri Shrihan : సిరి, శ్రీహాన్‌ కలిశారు హ్యాపీ.. మరి దత్త పుత్రుడు ఎక్కడ ఉన్నాడు?

Authored By
Himanshi
The Telugu News | Updated on: February 7, 2022 1:23 pm
Advertisement

Siri Shrihan : యూట్యూబ్ సెన్సేషన్ అయినా సిరి మరియు షణ్ముఖ్‌ ల ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టాయి అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ బిగ్ బాస్‌ సీజన్ 5 లో వ్యవహరించిన తీరు కారణంగానే వీరి ప్రేమ వ్యవహారాలు చెడి పోయాయి అని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పటికే దీప్తి సునైనా తన ప్రేమకు బ్రేకప్ చెపి షన్నూ ను దూరం పెట్టిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో సిరి కూడా తన ప్రియుని దూరం పెడుతుంది అంటూ వార్తలు వచ్చాయి. కొన్నాళ్లుగా కనీసం సోషల్ మీడియాలో కూడా వీరిద్దరు పలకరించుకోవడం, ఒకరి ఫొటోలు ఒకరు ఒకరు షేర్ చేసుకోక పోవడంతో ఇద్దరు విడిపోయినట్లు అని అంతా భావించారు. మీడియాలో ఆ రేంజ్ లో ప్రచారం జరుగుతున్న సమయంలో అనూహ్యంగా ఇటీవల యాంకర్ రవి కుటుంబం తో కలిసి వీరిద్దరూ సందడి చేశారు. దాంతో సిరి ప్రేమ వ్యవహారానికి బ్రేక్‌ పడలేదని క్లారిటీ వచ్చేసింది.

Advertisement

ఇద్దరు కూడా బయట తిరగడం లేదు కాని ఇద్దరు ప్రేమలోనే ఉన్నారని ఒక స్పష్టత అనేది రావడంతో ఇప్పుడంతా దీప్తి సునైనా మరియు షణ్ముఖ్‌ లకు సంబంధించిన ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో సిరి గతంలో దత్తత తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చిన ఒక బాబు గురించి కూడా చర్చ జరుగుతుంది. సిరి గత కొన్నాళ్లుగా ఎక్కడ చూసినా ఒంటరిగానే కనిపిస్తుంది. ఆ బాబు మాత్రం కనిపించడం లేదు. బిగ్ బాస్‌ లో ఆమె వ్యవహారం కారణంగా బాబు అసలు తల్లిదండ్రులు అతడిని తీసుకొని వెళ్ళారా అనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.సిరి అభిమానులు మరియు సోషల్‌ మీడియా జనాలు మాత్రం బాబును సిరి ఎక్కడ ఉంచింది అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రస్తుతం సిరితో బాబు ఉన్నాడా లేదా అనేది క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే ఆమె ఈ మధ్య సోషల్ మీడియా లో తెగ పోస్టులు పెడుతుంది కానీ అందులో ఎక్కడా కూడా ఆమె పక్కన గాని…

where is siri and Shrihan son

Advertisement

Siri Shrihan : సిరి, శ్రీహాన్ ల బాబు ఎక్కడ ఉన్నాడు

ఆమె బాబుతో ఉన్నట్లుగానే అనిపించడం లేదు. ఒక సింపుల్ అమ్మాయి మాదిరిగా ఫొటోలు వీడియోలను షేర్ చేస్తుంది. ఒక తల్లిలా ఆమె వ్యవహరించడం లేదు కనుక ప్రస్తుతం ఆమె వద్ద బాబు లేడేమో లేదేమో అని అనిపిస్తుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు శ్రీహాన్ తో సిరి మళ్ళీ కలిసింది కాబట్టి బాబుని మళ్లీ కెమెరా ముందుకు తీసుకు వస్తుందేమో చూడాలి. గతంలో బాబుతో కలిసి ఎన్నో ఫోటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. కానీ గత కొన్ని నెలలుగా మాత్రం బాబుతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేయడం లేదు. బిగ్ బాస్ స్క్రీన్ పై కూడా బాబు ని చూపించక పోవడంతో అసలు ఏం జరుగుతుంది అని అభిమానులు చర్చించుకుంటున్నారు

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి