where is Sridevi drama company Pulsar Bike Jhansi
Pulsar Bike Jhansi : ఏపీఎస్ ఆర్టీసీ బస్ కండక్టర్ గా విధులు నిర్వహిస్తూనే స్టేజ్ షోలు చేస్తున్న డాన్సర్ ఝాన్సీ కి శ్రీదేవి డ్రామా కంపెనీలో పల్సర్ బండి పాటకు డాన్స్ చేసే అవకాశం వచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఝాన్సీ యొక్క పల్సర్ బండి పాట డాన్స్ చూసి అంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అప్పటి నుండి పల్సర్ బండి ఝాన్సీ అయ్యింది. సోషల్ మీడియాలో ఝాన్సీ క్రేజ్ అమౌంట్ పెరిగి పోయింది. ఆ మధ్య వరుసగా జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేసిన ఝాన్సీ ఇప్పుడు కనిపించడం లేదు.
అయ్యో పాపం మళ్ళీ బస్సు కండక్టర్ గా ఝాన్సీ విధులు నిర్వహిస్తుందా.. అవకాశాలు అంతలోనే కనిపించకుండా పోయాయి.. క్రేజ్ తగ్గి పోయిందా అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే ఝాన్సీ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. ఒక వైపు జాబ్ చేస్తూనే మరో వైపు ఆమె ప్రైవేట్ ఆల్బమ్స్ లో నటిస్తోంది. గత కొన్ని రోజులుగా వరుసగా ఆమె ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూనే ఉంది. శ్రీదేవి డ్రామా కంపెనీ తో గుర్తింపు వచ్చిన తర్వాత ఏకంగా 10 ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ లో ఈమె నటించిందట.
where is Sridevi drama company Pulsar Bike Jhansi
అంతే కాకుండా గతంలో చేసినట్లు స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా పల్సర్ బండి ఝాన్సీ చేస్తుంది. గతంలో ఉన్న రెమ్యూనరేషన్ కి ఇప్పటి రెమ్యూనరేషన్ కి 100 రెట్ల తేడా ఉంది అంటూ ఆమె సన్నిధిలో చెప్తున్నారు. సినిమాల్లో కూడా ఈమె సందడి మామూలుగా లేదు. ముందు ముందు కొరియోగ్రాఫర్ గా ఝాన్సీ సత్తా చాటే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి లక్ అంటే నిజంగా ఝాన్సీదే అంటూ చాలా మంది కళాకారులు కామెంట్స్ చేస్తున్నారు.
GST 2.0 : జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్ర…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే…
Oneplus | ప్రీమియం లుక్, ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికీ మంచి సమయం ఇది. రూ.30,000 - రూ.40,000…
AP District Court Jobs | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న…
Bigg Boss9 | తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9’ సెప్టెంబర్…
Anushka Shetty | టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై…
Allari Naresh | అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆల్కహాల్. ఈ సినిమా మెహర్ రాజ్…
Water | ఉదయం లేవగానే చాలామందికి బ్రష్ చేయడం, తర్వాత వెంటనే నీళ్లు తాగడం అలవాటు. కానీ పెద్దవాళ్లు "బ్రష్ చేసిన…
This website uses cookies.