Home » Entertainment » Which Hero Is Number One In Kamma Kapu Kshatriya Caste In Tollywood
Entertainment

Caste : కమ్మ, కాపు, క్షత్రియ.. ఏ కులం హీరో టాలీవుడ్ లో నెంబర్ వన్?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: August 23, 2023, 1:00 pm
Advertisement

Caste : తెలుగు సినిమా పరిశ్రమ గురించి దాని చరిత్ర గురించి మాట్లాడుకోవాలంటే దాన్ని మద్రాసు నుంచే ప్రారంభించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రారంభం అయ్యిందే మద్రాసులో. ఆనాడు నాటకాల మీద ఇష్టంతో చాలామంది సినిమాల్లోకి వెళ్లారు. అప్పట్లో తెలుగు వారికి అంతగా గుర్తింపు లేదు. అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నందమూరి తారకరామారావు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వల్లనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గుర్తింపు వచ్చింది.

Advertisement

తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాసులోనే ఉన్నా కూడా తెలుగు సినిమా పరిశ్రమకు వాళ్లవల్లనే ఒక గుర్తింపు లభించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత కృష్ణ, శోభన్ బాబు లాంటి వాళ్లు వచ్చి సినిమా ఇండస్ట్రీకి మరింత క్రేజ్ తీసుకొచ్చారు. ఎన్టీఆర్ వరుసగా చేసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి కూడా రావడం, ముఖ్యమంత్రి అవడం తెలుగు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీ, రాజకీయ రంగంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. కొన్నాళ్లు కృష్ణ కూడా సినీ ఇండస్ట్రీని ఏలారు. ఆ తర్వాత చిరంజీవి అరంగేట్రం చేశారు. ఇండస్ట్రీని చాలా ఏళ్ల పాటు ఏలారు.ఒకానొక సమయంలో ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు కృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలారు. అదే సమయంలో చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చారు. చిరంజీవికి డ్యాన్స్ ప్లస్ పాయింట్ కావడంతో కృష్ణను దాటుకొని వెళ్లి ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా నిలిచారు.

which hero is number one in kamma kapu kshatriya caste in tollywood

Advertisement

Caste : కృష్ణ స్థానాన్ని ఆక్రమించుకున్న చిరంజీవి

ఆ తర్వాత తరంలో ఎవరు ఇండస్ట్రీలో నెంబర్ వన్ అవుతారు అని అంతా ఎదురు చూశారు. పవన్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఇలా చాలామంది కుర్ర హీరోలు వచ్చినా ఎవ్వరూ అంతగా టాప్ పొజిషన్ ను అందుకోలేకపోయారు. ఒక్కోసారి ఒక్కో హీరో టాప్ లో ఉండేవారు. ఆ తర్వాత మరో హీరో. ఇలా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ మారుతూ ఉండేది. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు టాప్ పొజిషన్ లో ఉన్న హీరో రవితేజ. ఇక.. రవితేజ తర్వాత ఆ ప్లేస్ లోకి ఎవరు వస్తారో వేచి చూడాల్సిందే.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి