Home » Entertainment » Who Is The Villian In Rajamouli And Mahesh Babu Movie
Entertainment

Rajamouli – Mahesh Babu Movie : మహేష్ బాబు – రాజమౌళి సినిమాలో విలన్ దొరికేసాడు.. హాలీవుడ్ లో అతిపెద్ద విలన్

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: October 17, 2022, 10:30 am
Advertisement

Rajamouli – Mahesh Babu Movie : ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో రాబోయే సినిమా ఏంటి అని అందరూ తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. తన నెక్స్ట్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుందని ఇప్పటికే రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రపంచాన్ని చుట్టే ఓ యాత్రికుడి చుట్టూ తిరుగుతుందని, ఇందులో మహేశ్ బాబు ఒక ప్రపంచ యాత్రికుడిగా కనిపిస్తాడని ఒక హింట్ ఇచ్చారు రాజమౌళి. ఆ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెను తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇక.. ఈ సినిమాలో విలన్ ఎవరు?

Advertisement

అనే ప్రశ్న దాదాపు అందరిలోనూ స్టార్ట్ అయింది. ఎందుకంటే రాజమౌళి సినిమాల్లో హీరోకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. విలన్స్ కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. హీరోలకు దీటుగా విలన్ రోల్స్ ను డిజైన్ చేస్తాడు జక్కన్న. అందుకే మహేశ్ మూవీలో విలన్ గా ఎవరిని తీసుకుంటాడు అని అందరూ తెగ ఎదురు చూస్తున్నారు. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. మహేశ్, రాజమౌళి సినిమాలో విలన్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.తమిళంలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న కార్తీని ఈ సినిమాకు విలన్ గా రాజమౌళి ఎంపిక చేశారట. నిజానికి.. కార్తీకి తెలుగులో ఒక స్టార్ హీరోకు ఉన్నంత క్రేజ్ ఉంది.

who is the villian in Rajamouli and Mahesh Babu Movie

Advertisement

Rajamouli – Mahesh Babu Movie : తమిళం హీరో కార్తీని విలన్ గా ఎంపిక చేశారట?

తమిళంలోనూ ఆయనకు ఉన్న మార్కెట్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో ఊపిరి అనే సినిమాలో నటించి తన సత్తా ఏంటో చాటుకున్నాడు కార్తీ. ఇక.. తమిళంలో డిఫరెంట్ జానర్ లో చాలా సినిమాలు చేసి తనేంటో, తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు కార్తీ. ప్రస్తుతం రాజమౌళి, మహేశ్ సినిమాలో విలన్ రోల్ కోసం కార్తీని మూవీ యూనిట్ సంప్రదించిందట. అసలే రాజమౌళి సినిమా, మరోవైపు ఆయన పాత్ర కూడా కార్తీకి బాగా నచ్చిందట. దీంతో వెంటనే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట కార్తీ. ప్రస్తుతం మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక రాజమౌళి సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి