Home » Entertainment » Why Anchor Sreemukhi Is Afraid Of Marriage
Entertainment

Sreemukhi : పెళ్లి పేరు చెబితే శ్రీముఖి అంత భయపడుతోంది అందుకేనా.. వాడు ఆ రేంజ్ లో టార్చర్ పెట్టాడా?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: November 25, 2022, 7:40 pm
Advertisement

Sreemukhi : శ్రీముఖిని అందరూ బుల్లితెర రాములమ్మ అంటారు దానికి కారణం.. తను మాట్లాడే మాటలు, తన స్పీడ్, తన వాయిస్, తన స్పాంటెనిటీ అన్నీ అలా ఉంటాయి మరి. తను ఒక్కసారి మైక్ పట్టుకుందంటే.. నిజానికి మైక్ పట్టుకోవాల్సిన అవసరం లేదనుకోండి.. ఎందుకంటే తన గొంతే ఒక మైక్. లొడలొడా వాగేయడమే తనకు తెలుసు. లోపల ఏం దాచుకోదు. మనసులో ఉన్నదంతా కక్కేస్తుంది శ్రీముఖి. తనది లొడలొడా వాగే మనస్తత్వమే కాదు.. తను చాలా అందగత్తె కూడా.

Advertisement

అందుకే తను ఇప్పటికీ తెలుగు బుల్లితెరను ఏలేస్తోంది. ప్రస్తుతం తన చేతుల్లో చాలా షోలు ఉన్నాయి. టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న యాంకర్ శ్రీముఖి గురించి ఎవ్వరినైనా ప్రశ్నిస్తే వాళ్లు పెళ్లెప్పుడు అని అడుగుతారు. ఎప్పుడో ఇండస్ట్రీకి వచ్చావు ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటూ శ్రీముఖిని అడగని వాళ్లు ఉండరు. కానీ.. తనకు ఇంత వయసు వచ్చినా శ్రీముఖి పెళ్లి చేసుకోకపోవడానికి ఒక రీజన్ ఉంది. ఒక రీజనే కాదు.. అది చాలా పెద్ద రీజన్. నిజానికి శ్రీముఖి తన కాలేజీ రోజుల్లోనే ఓ అబ్బాయిని ప్రేమించింది. అతడు కూడా తనను ప్రేమించాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. చాలా ఏళ్ల పాటు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు.

why anchor sreemukhi is afraid of marriage

Advertisement

Sreemukhi : తన కాలేజీ రోజుల్లోనే ఓ అబ్బాయిని ప్రేమించిన శ్రీముఖి

క్లోజ్ గా మూవ్ అవడం శ్రీముఖికి ఒక్కోసారి నచ్చకపోయేదట. ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న శ్రీముఖి.. అతడిని దూరం పెట్టడం స్టార్ట్ చేసిందట. తనను దూరం పెడుతుందని తెలుసుకున్న అతడు.. ఆమెను టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడట. పిచ్చి పిచ్చి వీడియోలను చూపి తనను చాలా బాధపెట్టేవాడట. తన ప్రైవేటు ఫోటోలను నెట్ లో పెడతా అని బెదిరించాడట. అతడి టార్చర్ భరించలేక చివరకు చనిపోదామని కూడా అనుకున్న శ్రీముఖి.. చివరకు ఆ సమస్య నుంచి బయటపడి ఇండస్ట్రీకి వచ్చింది. ప్రస్తుతం స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నప్పటికీ.. పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు. దానికి కారణం తన పాస్ట్ లైఫ్ లో ఉన్న ఆ ఘటనే కారణం అని అంటున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి