why Anchor Udaya Bhanu not went bigg boss season 6
Udaya Bhanu : బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ప్రారంభం అయింది. గత మూడు నెలలుగా ఈ సీజన్ గురించి సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. ఎట్టకేలకు స్టార్ మా లో ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సీజన్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న కంటెస్టెంట్స్ అంటూ పలువురి పేర్లు మొదటి నుండి వినిపించాయి. ఆ పేర్లలో కొందరు ఇప్పుడు కనిపిస్తున్నారు. కానీ కొందరు మాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా ఉదయభాను ఈ కార్యక్రమంలో ఉంటుంది అంటూ మూడు నెలలుగా ప్రచారం జరుగుతూనే ఉంది.
గత రెండు మూడు సీజన్లలో ఆమె ఉంటుందని అన్నారు కానీ ఆమె పిల్లలు చిన్నవాళ్లు అవ్వడం వల్ల ఆమె ఆసక్తి చూపడం లేదు అని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఆమె ఈ సీజన్ లో అడుగు పెట్టేందుకు సిద్ధమైందని సీజన్ లోనే అత్యధిక పారితోషికం ఆమెకు దక్కబోతుంది అంటూ కూడా మీడియాలో కథనాలు కుప్పలు తిప్పలుగా వచ్చాయి. చివరికి ఆమె బిగ్బాస్ హౌస్ లో అడుగు పెట్టనే లేదు. వైల్డ్ కార్డు ఎంట్రీ తో అయినా అడుగు పెడుతుందో తెలియదు. అసలు ఉదయభాను ఎందుకు సైడ్ అయిపోయింది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
why Anchor Udaya Bhanu not went bigg boss season 6
పిల్లలు పెద్ద వాళ్లు అయ్యారు కనుక తాను బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ ఒక ఇంటర్వ్యూలో ఉదయభాను చెప్పినట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. కనుక ఆమె కచ్చితంగా బిగ్ బాస్ ఎంట్రీ ఉంటుందని అంతా భావించారు. కానీ ఎంట్రీ లేదు.. కనీసం ఆమె మీడియా ముందుకు వచ్చి తన బిగ్ బాస్ కు సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఉదయభాను కు ఏమైంది.. ఆమె చివరి నిమిషంలో ఎందుకు బిగ్బాస్ హౌస్ లో అడుగు పెట్టలేదు అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా అయినా ఈ విషయం గురించి ఆమె స్పందిస్తే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. మరి ఆమె ఈ విషయమై స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.