Home » Entertainment » Why Auto Ramprasad Prayed Cameras
Entertainment

Auto Ramprasad : ఆటో రామ్ ప్రసాద్ కెమెరాలకు దండం పెట్టడంతో అందరూ ఏం చేశారో తెలుసా..?

Authored By
vamana sai
The Telugu News | Updated on: August 10, 2021 7:17 am
Advertisement

Auto Ramprasad : ఆటో రామ్ ప్రసాద్..బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ లో తను ఎంతగా ఆకట్టుకుంటున్నాడో అందరికీ తెలిసిందే. ఈ షోలో ఎంతమంది కమెడియన్స్ ఉన్నా కూడా ఎవరికి వారు తమ పర్ఫామెన్స్ లతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటారు. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతోనే సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటున్నారు. నలుగురిలో ఒకడిగా పరిచయమై స్టార్ కమెడియన్ గా ఎదిగిన వారిలో ఆటో రామ్ ప్రసాద్ ఒకరు. తన పంచులతో తెగ నవ్విస్తున్నాడు. ఈ కమెడియన్ తాజాగా కెమెరాలకు దండం పెడుతూ కనిపించడం ఇప్పుడు వైరల్ అవుతోంది.

Advertisement

why auto-ramprasad-prayed cameras

జబర్దస్త్ లో గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, సన్నీ వాళ్లతో కలిసి స్కిట్ లు చేస్తూ తన కామెడీతో బాగా ఆకట్టుకుంటున్నాడు రామ్ ప్రసాద్. తన ఆటో పంచులతో బాగా పాపులారిటీ తెచ్చుకొని ఆటో రామ్ ప్రసాద్ గా పేరు మార్చుకున్నాడు. అయితే తాజాగా కెమెరాలకు దండం పెడుతూ కనిపించాడు రామ్ ప్రసాద్. ఇంతకీ అలా ఎందుకు చేశాడు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన కొత్త ఎపిసోడ్ ప్రోమో వదిలారు.

Advertisement

Auto Ramprasad : ఆటో రామ్ ప్రసాద్… నన్ను కాపాడండోయ్..

ఈ ప్రోమోలో కమెడియన్స్ అందరూ తమ పర్ఫామెన్స్ లతో బాగా ఆకట్టుకున్నారు. వీరిలో కెవ్వు కార్తీక్ స్కిట్ లో బుల్లితెర నటి ఎంట్రీ ఇచ్చింది. కార్తీక్ పెళ్లి అయ్యిందని కాస్త జలసీ గా ఫీల్ అయినట్లు ఆమెని చూపించారు. వెంటనే రోజా ఆ పాయింట్ అందుకొని.. కార్తీక్.. నీకు పెళ్లి అయిందని అమ్మాయి కొంచెం నర్వస్ గా ఉంది అన్నారు. దాంతో వెంటనే ఆ అమ్మాయి నేనేం నర్వస్ గా లేను.. వాడే నర్వస్ గా ఫీల్ అవుతున్నాడు అని చెప్పి షాకిచ్చింది.

అయితే ఈ డైలాగ్.. రీసెంట్‌గా ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోలో ఓ డాన్సర్ మాట్లాడినది. దీనినే తీసుకొని వీళ్ళు కూడా అదే విధంగా మాట్లాడారు. అలా స్కిట్ కాస్త ఓవర్ అయిపోయింది. దాంతో ఆటో రామ్ ప్రసాద్ వెంటనే, నన్ను కాపాడండోయ్.. అనే మీమ్స్ డైలాగుతో కెమెరా ముందుకు వచ్చి దండం పెట్టాడు. దీంతో అక్కడున్న వాళ్ళంతా బాగా నవ్వుకున్నారు. ఇదే సమయంలో స్కిట్ తర్వాత మరో కమెడియన్ ఆల్రెడీ ఢీ లో చూశాము. ఇక్కడ కూడా అవసరమా అంటూ పంచ్ వేసాడు.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి