Home » Entertainment » Why Didnt Balakrishna Make Naga Chaitanya As Son In Law
Entertainment

Naga chaitanya: నాగచైతన్య ను రిజక్ట్ చేసిన బాలకృష్ణ ఎందుకు అల్లుడిగా చేసుకోలేదంటే..?

Authored By
mallesh
The Telugu News | Published on: December 7, 2021, 1:40 pm
Advertisement

Naga chaitanya : నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీలోనే పెద్ద కుటుంబాలు.. మెగా ఫ్యామిలీతో సంబంధం లేకుండా ఆనాడు ఎన్టీయార్, ఏఎన్నార్ ఒకే కుటుంబసభ్యులుగా కలిసి మెలసి ఉన్నారు. సినిమాల పరంగా విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా పోటీ పడి మరి సినిమాలు చేసిన వీరు ఏ మాత్రం బేషజాలకు పోకుండా తమ వారసులకు కూడా అదేస్నేహ హస్తాన్ని అందించారు. ఇప్పుడు కూడా అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున, నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ మధ్య మంచి అనుబంధం ఉంది. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా ఇరు ఫ్యామిలీస్ తమ కుటుంబసభ్యులతో కలిసి హాజరవుతారు.నందమూరి బాలకృష్ణకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

పెద్దకూతురు బ్రాహ్మణీని నారా చంద్రబాబు తనయుడు నారాలోకేష్‌కు ఇచ్చి వివాహం జరిపించిన బాలయ్య.. తన రెండో కూతురు తేజస్విని అక్కినేని నాగచైతన్యకు ఇచ్చి వివాహం జరిపించాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని నాగార్జునతో మాట్లాడగా అందుకు చాలా సంతోషించారట.. నందమూరి, అక్కినేని కుటుంబాలు వియ్యంకులు కావొచ్చని చాలా అనుకున్నారట.. అయితే, చైతూ మాత్రం వీళ్ళ ఆశలను ఆడియాశలు చేశాడు. పెళ్లి విషయంపై చైతూను తండ్రి నాగ్ అడుగగా సమంతతో ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెడ్డాడు చైతూ. దీంతో బాలకృష్ణ చైతూను అల్లుడిగా రిజక్ట్ చేసి తన రెండో కూతురిని వైజాగ్ గీతం సంస్థల యాజమాని కొడుకు భరత్‌‌కు ఇచ్చి పెళ్లి జరిపించారు.

why didnt Balakrishna make Naga chaitanya as son in law

Naga chaitanya : నాగచైతన్య ను రిజక్ట్ చేసిన బాలయ్య

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి